మెగా కోడలు ఉపాసన( Upasana ) మంగళవారం తెల్లవారుజామున పండంటి ఆడబిడ్డకు ( Baby Girl ) జన్మనిచ్చిన విషయం మనకు తెలిసిందే.ఇలా ఉపాసన డెలివరీ కోసం సోమవారం జూబ్లీహిల్స్ లోని అపోలో హాస్పిటల్ కు వెళ్లారు.
ఇక ఉపాసన డెలివరీ కోసం వెళ్ళిన సమయంలో తనతో పాటు రామ్ చరణ్ అలాగే ఉపాసన తల్లి గారు ఇక చరణ్ తల్లి సురేఖ ( Surekha ) గారు కూడా తన వెంటే ఉన్నారు అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.అయితే ఉపాసనకు డెలివరీ చేస్తున్నటువంటి సమయంలో సురేఖ గారు చేసినటువంటి పని గురించి ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
<img src="https://telugustop.com/wp-content/uploads/2023/06/Mega-Family-Ram-Charan-Upasana-Baby-Girl.jpg“/> అపోలో హాస్పిటల్లో ఒక ప్రత్యేకమైన గదిలో సురేఖ తన ఇంటికి వారసురాలు రాబోతున్న సమయంలో తను క్షేమంగా ఉండాలని కోరుకుంటూ హనుమాన్ చాలీసా ( Hanuman Chalisaa ) చదివారని తెలుస్తోంది.ఇక మెగా కుటుంబ సభ్యులు ఆంజనేయ స్వామికి ఎంతో భక్తులు అనే విషయం మనకు తెలిసిందే.ఆంజనేయ స్వామి( Anjaneya Swamy ) ఆశీస్సులతో అంటూ చిరంజీవి ఉపాసన ప్రెగ్నెన్సీ విషయాన్ని తెలియజేశారు.అలాగే తనకి ఎంతో ఇష్టమైనటువంటి మంగళవారం రోజున తన ఇంటికి వారసురాలు రావడం చాలా సంతోషంగా ఉందని చిరంజీవి తెలియజేసిన సంగతి మనకు తెలిసిందే. ఇలా తన ఇంటికి వారసురాలు రాబోతున్న సమయంలో సురేఖ ప్రత్యేకంగా తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండాలన్న ఉద్దేశంతో హనుమాన్ చాలీసా చదివారని తెలిసి తన కోడలపై తనకు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది.డెలివరీ అయిన తర్వాత డాక్టర్లు తన బిడ్డను తీసుకువచ్చి రామ్ చరణ్ ( Ramcharan ) చేతులలో పెట్టగా రామ్ చరణ్ మాత్రం తన బిడ్డను ముందుగా తన తండ్రి ఎత్తుకోవాలన్న ఉద్దేశంతో తన కుమార్తెను చిరంజీవి ( Chiranjeevi ) గారి చేతులలో పెట్టమని చెప్పారట.దీన్ని బట్టి చూస్తే రామ్ చరణ్ పిల్లల కోసం సురేఖ చిరంజీవి ఎంతగా ఎదురుచూస్తున్నారో అర్థమవుతుంది.