ఎనర్జిటిక్ హీరో రామ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలయికలో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ మరో హిట్ అందుకోలేకపోయాడు.
ఇక అఖండ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బోయపాటి.ప్లాప్ లో ఉన్న రామ్ తో సినిమా అనగానే వీరి కాంబో ఫై అంచనాలు పెరిగిపోయాయి.
ప్యాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ ని బోయపాటి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
బోయపాటి కి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కథ బాగా కలిసి వస్తుంది.గతంలో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కించిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.
ఇక ఇప్పుడు మరోసారి తనకు కలిసొచ్చే పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కథ తో రామ్ తో చేస్తున్నట్లు ప్రచారం సాగుతుంది.రామ్ సైతం ఈ మూవీ కోసం తన మేకోవర్ ను పూర్తి గా మార్చుకున్నాడట.
ఈ సినిమా తో హిట్ కొట్టి మళ్లీ తన సత్తా చూపించాలని ఆశపడుతున్నాడు.ఇప్పటివరకు దీనిపై బోయపాటి స్పందించలేదు.
ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఓ స్పెషల్ సాంగ్ లో కనిపిస్తుండగా, రామ్ సరసన శ్రీలీల హీరోయిన్ గా కనిపించనుంది.తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.