'మాస్క్ ఈజ్ ది వ్యాక్సిన్' అంటున్న సీఎం... ఎక్కడంటే

కరోనా మహమ్మారి సృష్టిస్తున్న భీభత్సం తో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సి వస్తుంది.మనుషుల మధ్య దూరం పాటిస్తూ ప్రతి ఒక్కరూ మాస్క్ లు ధరించడం తప్పనిసరి అని ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ ప్రజలు మాత్రం ఏమాత్రం లక్ష్యపెట్టడం లేదు.

 Rajasthan To Make Masks Compulsory Through Law Today , Rajasthan, Chief Minister-TeluguStop.com

మరోపక్క సెకండ్ వేవ్ కూడా వచ్చే అవకాశం ఉందని,మరో 3 నెలలు మరింత జాగ్రత్తలు పాటించాలి అంటూ హెచ్చరికలు కూడా మొదలయ్యాయి.ఇంతగా ఎన్ని జాగ్రత్తలు చెప్పినా జనాలు మాత్రం లెక్కచేయడం లేదు.

దీనితో సీఎం గారు ఒక చట్టం తీసుకువచ్చే పనిలో పడ్డారు.ఇంతకీ ఇదంతా ఎక్కడ, ఆ సీఎం ఎవరు అని ఆలోచిస్తున్నారా….

రాజస్థాన్ లో … రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ మాస్కుల ధారణ తప్పని సరి చేస్తూ సోమవారం నుంచే చట్టం తెస్తున్నామని ప్రకటించారు.కోవిడ్ 19 పై పోరుకు దేశంలో ఈ విధమైన చట్టం తేవడంలో తమదే మొట్టమొదటి రాష్ట్రమని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.

‘మాస్క్ ఈజ్ ది వ్యాక్సీన్’ అని అంటూ ఆయన ఈ చట్టం గురించి అభివర్ణించారు.కరోనా వైరస్ పై పోరాటానికి ప్రజా ఉద్యమం ఇప్పటికే మొదలైందని, ఇదే సమయంలో మాస్క్ లను నిర్బంధం చేస్తూ చట్టం తెస్తున్నామని ఆయన వెల్లడించారు.

మరోపక్క దేశవ్యాప్తంగా కూడా కేసులు పెరగకుండా నిరోధించడం కోసం కేంద్రం ప్రయత్నం చేస్తున్నప్పటికీ రాజస్థాన్ సర్కార్ మాత్రం తమ వంతు ప్రయత్నంగా ఇలాంటి చట్టం తేవాలని భావించింది.అంతేకాకుండా రాజస్తాన్ లో నిన్న ఒక్కరోజే 10 మంది కరోనా రోగులు మరణించడం తో ఇప్పటివరకు ఆ రాష్ట్ర వ్యాప్తంగా మృతి చెందినవారి సంఖ్య 1,917 కి పెరిగింది.

అలానే నిన్న ఒక్కరోజే కొత్తగా 1754 కేసులు నమోదవ్వడం తో రాజస్థాన్ సీఎం గెహ్లాట్ ఇలాంటి నిర్ణయం తీసుకోక తప్పలేదు.ఇప్పటికే ఆ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా ఇన్ఫెక్షన్ సోకినవారి సంఖ్య 1,98,747 కి పెరిగినట్లు తెలుస్తుంది.

మరోపక్క దీపావళి దగ్గర పడుతున్నప్పటికీ కోవిడ్ నేపథ్యంలో బాణాసంచా అమ్మకాలను, వాటిని కాల్చడాన్ని ప్రభుత్వం నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.దీపావళి అనే కాకూండా పెళ్లిళ్లు వంటి శుభ కార్యాల సమయంలో కూడా ఎలాంటి బాణాసంచా కాల్చరాదని సీఎం గెహ్లాట్ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube