టీఎస్ ఆర్టీసీ బిల్లుపై రాజ్‎భవన్ క్లారిటీ

తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్టీసీ బిల్లుపై రాజ్‎భవన్ క్లారిటీ ఇచ్చింది.ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లు ఈనెల 2వ తేదీన మధ్యాహ్నం 3.30 గంటలకు రాజ్‎భవన్ కు వచ్చిందని తెలిపింది.ఈనెల 3వ తేదీన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయన్న రాజ్‎భవన్ డ్రాఫ్ట్ బిల్లు స్టడీ కోసం మరింత సమయం అవసరం అని స్పష్టం చేసింది.

 Raj Bhavan Clarity On Ts Rtc Bill-TeluguStop.com

అదేవిధంగా ఇది ఆర్థిక పరమైన బిల్లు కావడం చేత లీగల్ ఒపీనియన్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది.అయితే ఆర్టీసీ సిబ్బంది సంక్షేమమే లక్ష్యంగా వారిని కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ఇటీవలే కేసీఆర్ నేతృత్వంలోని కేబినెట్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే అందుకు సంబంధించిన బిల్లును యుద్ధ ప్రాతిపదికన రూపొందించి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కు పంపింది ప్రభుత్వం.ఈ బిల్లుకు రాజ్ భవన్ అనుమతి తెలిపితే నేటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టాలని భావించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube