టీఎస్ ఆర్టీసీ బిల్లుపై రాజ్‎భవన్ క్లారిటీ

తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్టీసీ బిల్లుపై రాజ్‎భవన్ క్లారిటీ ఇచ్చింది.ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లు ఈనెల 2వ తేదీన మధ్యాహ్నం 3.

30 గంటలకు రాజ్‎భవన్ కు వచ్చిందని తెలిపింది.ఈనెల 3వ తేదీన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయన్న రాజ్‎భవన్ డ్రాఫ్ట్ బిల్లు స్టడీ కోసం మరింత సమయం అవసరం అని స్పష్టం చేసింది.

అదేవిధంగా ఇది ఆర్థిక పరమైన బిల్లు కావడం చేత లీగల్ ఒపీనియన్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

అయితే ఆర్టీసీ సిబ్బంది సంక్షేమమే లక్ష్యంగా వారిని కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ఇటీవలే కేసీఆర్ నేతృత్వంలోని కేబినెట్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే అందుకు సంబంధించిన బిల్లును యుద్ధ ప్రాతిపదికన రూపొందించి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కు పంపింది ప్రభుత్వం.

ఈ బిల్లుకు రాజ్ భవన్ అనుమతి తెలిపితే నేటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టాలని భావించింది.

సినిమా వాళ్ళ దెబ్బకి విశ్వక్ సేన్ అడ్రస్ మార్చేశాడట !