2024 పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్‌, రాహుల్ సిద్ధమేనా?

2014 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్( Congress ) కు ఘోర పరాభవం ఎదురయ్యింది.అంతకు ముందు రెండు సార్లు వరుసగా అధికారాన్ని దక్కించుకుని పదేళ్ల పాటు సొంతంగా ప్రభుత్వంను ఏర్పాటు చేసిన యూపీఏ ఇప్పుడు 2024 పార్లమెంట్‌ ఎన్నికలపై ఆశలు పెట్టుకుంది.

 Rahul Gandi Ready To Next Parliament Elections , Karnataka , Parliament Elect-TeluguStop.com

బీజేపీ( BJP ) పై వ్యతిరేకత మరియు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ పై పెరుగుతున్న సానుకూల దృక్పదం కారణంగా కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తుందని కొందరు ఆ పార్టీ ముఖ్య నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మరో వైపు కాంగ్రెస్ లో ఉన్న సీనియర్ లు వెళ్లి పోయారు.

వారు వెళ్లి పోవడంతో పార్టీ మరింత దూకుడుగా ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

Telugu Amith Shah, Congress, Karnataka, Pm Modi, Rahul Gandhi, Sonia Gandhi-Poli

అభ్యర్థుల ఎంపిక విషయం మొదలుకుని ప్రతి విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ( Rahul gandi )యూత్ కాంగ్రెస్ కు అవకాశం ఇస్తున్నాడు.ఇక రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్ర కారణంగా కూడా దేశ వ్యాప్తంగా పార్టీకి కొత్త బలం చేకూరినట్లుగా అభిప్రాయం వ్యక్తం అవుతోంది.ప్రధాని నరేంద్ర మోడీ యొక్క వైఫల్యాలు ఎండగడుతూ సాగిన రాహుల్ యాత్ర విజవంతం అవ్వడంతో ముందు ముందు కచ్చితంగా ఎన్నికల్లో ఫలితాలను ఇవ్వబోతుంది అంటూ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో తేలిపోయింది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Telugu Amith Shah, Congress, Karnataka, Pm Modi, Rahul Gandhi, Sonia Gandhi-Poli

కర్ణాటక ఫలితాలు దేశ వ్యాప్తంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల నుండి మొదలుకుని కార్యకర్తల వరకు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అదే నమ్మకం తో వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేస్తూ ముందుకు వెళ్లాలి అంటూ చాలా బలంగా ఉన్నారు.మొత్తానికి పార్లమెంట్‌ ఎన్నికలు సమీపిస్తున్నా కొద్ది కాంగ్రెస్ పార్టీ అధినేత సిద్దం అవుతున్నాడు అంటూ ఆ పార్టీ నాయకులు అంటున్నారు.రాహుల్‌ పై ఇన్నాళ్లు నమ్మకం లేని కొన్ని పార్టీలు కూడా ఈ మధ్య కాలంలో బీజేపీకి మద్దతు పలుకుతూ ప్రకటనలు చేసిన విషయం తెల్సిందే.

ఇదంతా కూడా కేవలం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కారణంగా అనేది రాజకీయ వర్గాల మాట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube