తెలంగాణ కాంగ్రెస్( Telangana Congress ) లో గెలుపు జోష్ అప్పుడే మొదలైపోయింది అన్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది.ఇప్పటికే ప్రధాన పార్టీలు అన్నీ ఎన్నికల ప్రచారాన్ని మరింతగా ముమ్మరం చేశాయి .
జనాల్లోనూ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనే ప్రధాన పోటీ అన్నట్లుగా పరిస్థితి ఉండడం, ఇటీవల కాలంలో ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ లోకి నాయకులు చేరడం తదితర కారణాలతో తెలంగాణ కాంగ్రెస్ లో మంచి జోష్ కనిపిస్తోంది .నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో పూర్తిగా ఎన్నికల ప్రచారంపైనే అన్ని పార్టీలు దృష్టి సారించాయి .కాంగ్రెస్ కూడా ఓటర్లను ఆకట్టుకునే విధంగా వివిధ పథకాలను మేనిఫెస్టోలో పెట్టి ప్రచారం చేస్తుంది.ఎక్కడికక్కడ భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ ఈ ఎన్నికల్లో పై చేయి సాధించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఈ ఎన్నికల ప్రచారాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ అగ్ర నేతలు కూడా తెలంగాణలో మకాం వేసి ఎన్నికలు మూసే వరకు విస్తృతంగా కీలకమైన నియోజకవర్గాల్లో పర్యటించాలని, భారీ బహిరంగ సభను నిర్వహించి ఓటర్లను ఆకట్టుకునే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.ఈనెల 17 నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు , ప్రియాంక గాంధీ ఇతర ముఖ్య నేతలు తెలంగాణలోని మకాం వేసి అనేక భారీ సభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు .ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ జెండాను ఎగరవేయాలనే పట్టుదలతో ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు ఉన్నారు.అందుకే ఓటర్లను ఆకట్టుకునే విధంగా అనేక హామీలను గుప్పిస్తూ గతంలో ఎప్పుడూ చూడని అభివృద్ధి తెలంగాణలో చేసి చూపిస్తామని ప్రజలకు భరోసా ఇస్తున్నారు.
ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి( Revanth Reddy ) రోజుకు మూడు సభలు చొప్పున నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు.ఈసారి కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందని రేవంత్ బలంగా నమ్ముతున్నారు.అందుకే స్థానిక నాయకులతో పాటు , ఢిల్లీ అధినాయకత్వం కూడా హైదరాబాదులోని మకాం వేయబోతుంది. నవంబర్ లో మొత్తం 60 సభల వరకు నిర్వహించాలని కాంగ్రెస్ షెడ్యూల్ రూపొందించుకుంది .దానికి అనుగుణంగానే తెలంగాణలో ఎన్నికలు ప్రచారం కోసం ఇప్పటికే రెండు హెలికాప్టర్లను సమకూర్చుకున్నారు .ఒక హెలికాఫ్టర్ లో రేవంత్ రెడ్డి రోజుకు మూడు సభలు చొప్పున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.రాహుల్ గాంధీ ఈనెల 17 నుంచి హైదరాబాదులోనే మకాం వేయబోతున్నారు. ప్రియాంకతో పాటు, మల్లికార్జున ఖర్గే సైతం ఇక్కడే మకాం వేసే విధంగా షెడ్యూల్ రూపొందించుకున్నారు.
ఆరు రోజులు పాటు ముగ్గురు తెలంగాణలోనే ఉండి అనేక సభలు నిర్వహించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.అలాగే ఈ నెలాఖరు నాటికి సోనియా గాంధీతో మరో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది.
తెలంగాణ ఎన్నికలపై ప్రత్యేకంగా ఫోకస్ పెడుతుంది.