అయ్యో..పబ్జీ గేమ్ కోసం తల్లి అకౌంట్ ను ఖాళీ చేసిన కొడుకు..ఎంతంటే?

యువతకు ఏదైనా నచ్చితే దానిని వ్యసనంగా మార్చుకుంటున్నారు.ఆ వ్యసనంలో పడి ఏం చేస్తున్నామో కూడా తెలియ కుండా అంతా అయిపోయిన తర్వాత ఏం చేసిన ఉపయోగం ఉండదు.

 Pubg Addict Steals Rs 10 Lakh From Mother's Account For In-game Purchases, Joges-TeluguStop.com

పిల్లలు చేస్తున్న ఈ పనుల వల్ల తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు.తాజాగా ఒక కొడుకు తన తల్లి అకౌంట్ నుండి డబ్బులు మొత్తం మాయం చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇంతకీ ఏం ఘనకార్యం చేశాడా అని అనుకుంటున్నారా.పబ్జీ గేములో పడి తన తల్లి అకౌంట్ లో ఉన్న డబ్బును మాయం చేసాడు.ఇప్పటికే చాలా మంది పబ్జీ ఆటకు అలవాటు పడి ప్రాణాలు కోల్పోయారు.ఎన్నో దారుణాలు చేసిన ఘటనలు కూడా ఉన్నాయి.

అలాగే ఇప్పుడు చెప్పుకోబోయే వ్యక్తి కూడా పబ్జీ గేమ్ అంటే ఇష్టం.దానిని వ్యసనంగా అలవాటు చేసుకున్నాడు.

అతడికి 16 సంవత్సరాలు.వీరు ముంబై లో నివసిస్తున్నారు.అతడు తన తల్లి ఫోన్ లో పబ్జీ గేమ్ ఆడుతూ ఉన్నాడు.ఆ గేమ్ లో పడి ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా చేసాడు.

ఆ గేమ్ లో పడి తన తల్లి అకౌంట్ నుండి పడి పోగొట్టేసాడు.ఆ యువకుడు 10 లక్షలు పోగొట్టేసిన విషయం ఇంట్లో తెలిసిందని ఇంట్లో నుండి పారిపోయాడు.

అంధేరిలోని మహాకాళీ గుహల దగ్గరకు వెళ్లి దాక్కున్నాడు.

Telugu Mumbai, Pubg, Pubgaddict, Pubg India, Pubg Latest, Pubg Game-Latest News

ఆ యువకుడు తల్లి ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ యువకుడు కోసం గాలించి ఎట్టకేలకు తల్లిదండ్రులకు అప్పగించారు.ఆ యువకుడిని పోలీసులు ప్రశ్నించగా నెల రోజులుగా పబ్జీ ఆడుతున్నానని ఆ గేమ్ ఆడేందుకు ఐడి వర్చువల్ కరెన్సీ కోసం తన తల్లి అకౌంట్ నుండి 10 లక్షలు ఖర్చు చేసానని అందుకే ఇంటి నుండి పారిపోయానని పోలీసులకు జవాబు చెప్పడంతో షాక్ అవ్వడం పోలీసులు వంతు అయ్యింది.

డబ్బులు పోయిన తర్వాత ఒక రోజు తల్లి అకౌంట్ చూడగా డబ్బులు లేకపోవడంతో తల్లి కొడుకుని అడగగా అసలు విషయం చెప్పడంతో అతడు ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు.

ఆ యువకుడు పారిపోయేటప్పుడు లెటర్ రాసి ఇంట్లో నుండి మొబైల్ ఫోన్ తీసుకుని వెళ్లడంతో ఆ బాలుడిని వెతకడం పోలీసులకు సులువు అయ్యింది.ఇదండీ విషయం.పబ్జీ గేమ్ వ్యసనంగా మారడంతో 10 లక్షలు పోగొట్టేసాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube