జనగామ జిల్లాలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ప్రోటోకాల్ వివాదం చెలరేగింది.గాయత్రి గార్డెన్ లో క్రిస్మస్ వేడుకలతో పాటు బట్టల పంపిణీ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించారు.
అయితే ఈ మేరకు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీల్లో స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ ఫొటో లేకపోవడంతో బీఆర్ఎస్ ఆందోళన కార్యక్రమం చేపట్టింది.అధికార పార్టీ కాంగ్రెస్ కు కొమ్ముకాస్తున్నారంటూ కలెక్టర్ ఛాంబర్ లో పల్లా నిరసనకు దిగారు.
ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కలెక్టర్ తో వాగ్వివాదానికి దిగడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.