అల్లు అర్జున్ సందీప్ వంగా సినిమా కోసం అన్ని సంవత్సరాలు ఎదురుచూడాల్సిందేనా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) ప్రస్తుతం వరస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే.ఈయన పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

 Will Allu Arjun Have To Wait All These Years For Sandeep Vanga's Movie, Sandeep-TeluguStop.com

ఈ సినిమా ఈయనకు పాన్ ఇండియా రేంజ్ లో ఎంతో పేరు ప్రఖ్యాతలను తీసుకువచ్చింది.ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప( Pushpa ) సీక్వెల్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో సీక్వెల్ సినిమాపై కూడా భారీ స్థాయిలోనే అంచనాలు ఏర్పడ్డాయి.

పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ( Trivikram Srinivas ) డైరెక్షన్లో నటించబోతున్నారు.ఇప్పటికే ఈ సినిమాని అధికారకంగా కూడా ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే.

అయితే ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది.మరి త్రివిక్రమ్ బన్నీ కాంబినేషన్లో ఎలాంటి జానర్లో సినిమా రాబోతుంది అనే విషయాలు తెలియాల్సి ఉన్నాయి.

ఇకపోతే అల్లు అర్జున్ హీరోగా సందీప్ రెడ్డి ( Sandeep Reddy )వంగ దర్శకత్వంలో మరో సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అంటూ ఇదివరకు వార్తలు వచ్చాయి.

ఇక ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సిరీస్ కూడా అధికారకంగా ప్రకటించారు అలాగే ఈ విషయాన్ని అల్లు అర్జున్ కూడా రీ పోస్ట్ చేయడంతో వీధిద్దరి కాంబినేషన్లో సినిమా పక్క అంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.

ఇక ఇటీవల సందీప్ దర్శకత్వంలో వచ్చినటువంటి యానిమల్ సినిమాపై అల్లు అర్జున్ భారీ స్థాయిలో రివ్యూ ఇచ్చిన విషయం తెలిసిందే.ఇలా ఈ సినిమా పట్ల అల్లు అర్జున్ పెద్ద ఎత్తున రియాక్ట్ అవడంతో అల్లు అర్జున్ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేశారు.

Telugu Allu Arjun, Animal, Bollywood, Pushpa, Sandeep Vanga, Tollywood-Movie

యానిమల్ సినిమా మంచి సక్సెస్ కావడంతో అల్లు అర్జున్ సందీప్ కాంబినేషన్లో రాబోయే సినిమాపై కూడా అంచనాలు ఏర్పడ్డాయి.అయితే ఒక్కసారిగా అభిమానుల ఆశలపై సందీప్ రెడ్డివంగా నీళ్లు చల్లారని తెలుస్తోంది.వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రావడానికి సుమారు ఐదు సంవత్సరాల సమయం పడుతుంది అంటూ ఈయన చావు కబురు చల్లగా చెప్పినట్లు అయింది.యానిమల్ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో సందీప్ రెడ్డి స్పిరిట్ సినిమా పనులలో బిజీ కాబోతున్నారు.

ప్రభాస్ హీరోగా ఈ సినిమా వచ్చేయడాది ప్రారంభం కాబోతోంది ఇక ఈ సినిమా 2025 చివరికి విడుదల చేయాలని ఆలోచనలో ఉన్నారట.

Telugu Allu Arjun, Animal, Bollywood, Pushpa, Sandeep Vanga, Tollywood-Movie

ఇక ఈ సినిమా తర్వాత రణబీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ సినిమా సీక్వెల్ చిత్రాన్ని కూడా చేయాలనే ఆలోచనలో ఉన్నారని ఈ సినిమాకి కూడా సుమారు ఒక రెండు సంవత్సరాల సమయం పడుతుందని తెలుస్తుంది.ఈ లెక్కన ఈ రెండు సినిమాలను పూర్తి చేసేసరికి సందీప్ రెడ్డికి ఎంత లేదన్న 2028 వరకు సమయం పడుతుందని ఆ తర్వాతనే అల్లు అర్జున్ సినిమా షూటింగ్ పనులను ప్రారంభించబోతున్నారని తెలుస్తుంది.అల్లు అర్జున్ సినిమా షూటింగ్ పూర్తి చేయడానికి మరో రెండు సంవత్సరాలు సమయం తీసుకున్న వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రావటానికి మరో 7 సంవత్సరాల సమయం పడుతుందని స్పష్టంగా అర్థమవుతుంది అయితే అప్పటికి పరిస్థితులు ఎలా తారుమారవుతాయో తెలియదు.

ఇలా వీరిద్దరి కాంబినేషన్లో సినిమా గురించి ఇలాంటి వార్తలు వస్తున్నటువంటి తరుణంలో అభిమానులు ఈ సినిమాపై ఆశలు కూడా వదులుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube