ప్రజాస్వామ్య విలువలను కాపాడండి

సూర్యాపేట జిల్లా:కోదాడ అసెంబ్లీ ఎన్నిక( Kodada Assembly Election ) ప్రజాస్వామ్య విలువలతో జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని కోదాడ ఆర్డీవో,రిటర్నింగ్ అధికారి సూర్యనారాయణను పర్యావరణ పరిరక్షణ ఉద్యమకారుడు కొల్లు లక్ష్మినారాయణ కోరారు.సోమవారం ఆర్డీఓ ఆఫిస్ లో ఆయనకు వినతిపత్రం అందించారు.

 Protect Democratic Values , Democratic Values, Kodada Assembly Election-TeluguStop.com

డబ్బు, మద్యం ఇతర తాయిలాలతో ఓటర్లను మభ్యపెట్టే అభ్యర్థుల, నాయకుల,అనుచరులపై నిరంతరం నిఘా పెట్టాలని, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.అనంతరం ఆర్ఓకు మొక్కను బహుకరించారు.

ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లడుతూ ప్రజాస్వామ్య విలువలతో తమ ఓటును వినియోగించుకుని,ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే బాధ్యత ఓటర్లదేని సూచించారు.ఎన్నికల నిబంధనలు సక్రమంగా అమలు చేస్తామని చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube