Priyanka Chopra : ముంబై ఈవెంట్ లో ప్రియాంక చోప్రా ధరించిన వాచ్ ఖరీదెంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

బాలీవుడ్ బ్యూటీ, స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా( Priyanka Chopra ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.బాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న ప్రియాంక చోప్రా అమెరికా సింగర్ నిక్ జోనస్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

 Priyanka Chopra Wears Rs 15 Crore Watch Jio Mami Mumbai Film Festival-TeluguStop.com

ఆమె భర్త ఆమె కంటే వయసులో చాలా చిన్నవాడు అన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే.కేవలం బాలీవుడ్ సినిమాలలో మాత్రమే కాకుండా హాలీవుడ్ లో కూడా పలు సినిమాల్లో నటించి మెప్పించింది ప్రియాంక చోప్రా.

ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ హాలీవుడ్ సినిమాలలో( Hollywood movies ) నటిస్తూ బిజీ బిజీగా ఉంది.

Telugu Bollywood, Hollywood, Jiomami, Mumbai, Priyanka Chopra, Watch-Movie

ఆ సంగతి పక్కన పెడితే ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న జియో మామి ఫిల్మ్ ఫెస్టివల్ 2023( Jio mami mumbai film festival ) హాజరైంది ప్రియాంక చోప్రా.ఈ క్రమంలోనే తాజాగా శుక్రవారం రాత్రి ప్రారంభమైన ఈ ఫెస్టివల్‌లో ప్రియాంక చోప్రా తళుక్కున మెరిసింది.అందుకు సంబంధించిన ఫోటోలను ప్రియాంక చోప్రా తన ఇన్‌స్టాలో పంచుకుంది.

ప్రస్తుతం ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల అవుతున్నాయి.తన భార్య ఫోటోలు చూసిన నిక్ జోనస్ కామెంట్ చేశారు.

జియో మామి ముంబయి ఫిల్మ్ ఫెస్టివల్‌ను ప్రారంభింంచిన ప్రియాంక చోప్రా అనంతరం ఫోటోలకు పోజులిచ్చింది.

Telugu Bollywood, Hollywood, Jiomami, Mumbai, Priyanka Chopra, Watch-Movie

ఈ ఫిల్మ్ ఫెస్టివల్ కమిటీకి అధికారిక అధ్యక్షురాలిగా హోదాలో అడుగుపెట్టారు.అద్భుతంగా డిజైన్ చేసిన గౌను ధరించి రెడ్‌ కార్పెట్‌పై అందరి దృష్టిని ఆకర్షించింది.అయితే ఈవెంట్‌లో ప్రియాంక చోప్రా ధరించిన లగ్జరీ వాచ్‌పై అందరి దృష్టి పడింది.ఆమె వాచ్ విలువు దాదాపు రూ.1.5 కోట్ల విలువైనదిగా తెలుస్తోంది.ప్రియాంక ధరించిన వాచ్ 18 క్యారెట్ రోజ్ గోల్డ్ కేస్‌తో తయారు చేసినట్లు తెలుస్తోంది.

ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు శుక్రవారం తెల్లవారుజామున ముంబైకి చేరుకుంది ప్రియాంక.కాగా ఆమె ధరించిన వాచ్ ధర తెలిసి అభిమానులు నెటిజన్స్ షాక్ అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube