దేశంలోనే ఫస్ట్ విర్చువల్ మూవీ... ప్రకటించిన మలయాళీ స్టార్ హీరో

ఇప్పుడు సినిమా సరిహద్దులు పూర్తిగా చెరిగిపోయాయి.ప్రాంతీయ భాషా సినిమాల హవా ఇప్పటి వరకు ఉంటే ఇప్పుడు సినిమా అనేది ప్రాంతీయ బాషా అనే పరిధులని దాటి పాన్ ఇండియా రేంజ్ లో అన్ని భాషా ప్రేక్షకులని అలరించడానికి రెడీ అవుతుంది.

 Prithviraj To Star In Country's First Movie Shot Completely In Virtual, Prithvir-TeluguStop.com

బాహుబలితో జక్కన్న వేసిన పునాదుల మీద ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు విరివిగా తెరకేక్కుతున్నాయి.కాన్సెప్ట్ కొత్తగా ఉన్న, యూనివర్శల్ సబ్జెక్ట్ అయిన దానిని ఒక భాషాకి పరిమితం చేయకుండా సౌత్ భాషాలతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేసి మార్కెట్ ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఇప్పుడు తెలుగులోనే ఒక అరడజను సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్నాయి.ఇప్పుడు ఈ పాన్ ఇండియా కాన్సెప్ట్ తో తమిళ, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమలు కూడా అలవాటు చేసుకున్నాయి.

అందుకే ఆయా ఇండస్ట్రీలలో కూడా భారీ కాన్వాస్ మీద కథలని దర్శకులు ఆవిష్కరిస్తున్నారు.బడ్జెట్ ఎంతైనా పెట్టడానికి రెడీ అవుతున్నారు.

ఇప్పుడు మలయాళంలో స్టార్ హీరో పృధ్వీ రాజ్ సుకుమారన్ మరో అడుగు ముందుకి వేశాడు.

విర్చువల్ టెక్నాలజీలో తెరకెక్కనున్న మొదటి సినిమాని ప్రకటించాడు.

దీనికి సంబంధించి పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఫిల్మ్ మేకింగులోనే ఇదొక గొప్ప కళ.అలాగే విజ్ఞాన శాస్త్రంలో ఇదొక ఉత్తేజాన్నిచ్చే కొత్త అధ్యాయం.అందుకోసం ఎదురుచూస్తూ ఉండండి.

మారుతున్న కాలాలు కొత్త కొత్త సవాళ్లు వినూత్న పద్ధతులను అనుసరించి ఒక గొప్ప పురాణ కథను గొప్పగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం.అప్డేట్స్ కోసం వేచి ఉండండి అంటూ పోస్టర్ కింద మెన్షన్ చేసాడు.

ఇక పోస్టర్ చూసినట్లయితే ఈ సినిమాలో పృథ్వీరాజ్ ఒక యోధునిగా కనిపిస్తాడని అర్ధమవుతుంది.పీరియాడికల్ కాన్సెప్ట్ తో తెరకెక్కనున్న ఈ సినిమా ద్వారా ప్రేక్షకులని విర్చువల్ టెక్నాలజీ ద్వారా ఆ కాలానికి తీసుకొని వెళ్లి ప్రత్యక్షంగా చూసిన అనుభూతిని అందించనున్నారు.

ఈ ప్రాజెక్టును గోకుల్రాజ్ బాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు.పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను హిందీ మలయాళం తెలుగు తమిళం మరియు కన్నడ భాషలలో విడుదల చేయనున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube