కర్నూలు జిల్లా కౌతాళం మండలంలో విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది.హాల్విలోని ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ కొత్త భవనం కుప్పకూలింది.
ఈ ఘటనలో ఎనిమిది మంది విద్యార్థులకు గాయాలయ్యాయి.వెంటనే స్పందించిన ఉపాధ్యాయులు బాధిత విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు.
అయితే నాణ్యతా లోపం వలనే స్కూల్ భవనం కుప్పకూలిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.