భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన కొనసాగుతోంది.ఈ పర్యటనలో భాగంగా ఆమె యాదాద్రికి చేరుకున్నారు.
యాదాద్రిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు.స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రాష్ట్రపతికి మంత్రులు జగదీశ్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్ లు స్వాగతం పలికారు.ఆలయ వద్ద అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో ముర్ముకు స్వాగతం పలికారు.
యాదాద్రీశుడి దర్శనానంతరం రాష్ట్రపతికి ప్రధాన అర్చకులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను అందజేశారు.అనంతరం యాదాద్రి ప్రధాన ఆలయ ప్రదేశాలను ముర్ము పరిశీలించారు.
అద్దాల మండపం, ఫొటో ఎగ్జిబిషన్ ను తిలకించారు.