ప్రేమ . ఈ పేరు ఇప్పుడు చాలా సర్వసాధారణం.
ప్రేమ అనే పేరుతో కలవడం.ప్రతి చిన్న విషయానికి గొడవపడి విడిపోవడం చాలా మందిలో రొటీన్ గా కనిపిస్తూ ఉంటుంది.
కానీ ప్రేమ అనేది ఒక అద్భుతమైన ఫీలింగ్. జీవితాంతం కలిసి ఉండాలి అనే ఒక భావనను కలిగించే ఒక మంత్రం.
అలాంటి భావన ఇప్పటి ప్రేమికుల్లో లేదు అని ఖచ్చితంగా చెప్పొచ్చు.కానీ ప్రేమకు పూర్తిస్థాయి నిర్వచనం కల్పించిన సినిమా ప్రేమలేఖ.
( Premalekha Movie ) చూడకుండా, కలవకుండా కేవలం ఉత్తరాల్లోనే తమ ప్రేమను పంచుకుంటూ ఎలా కలిశారు అని చెప్పే ఈ చిత్రం అప్పటి తరం వారికి ఒక గొప్ప క్లాసిక్.బహుశా ఈ సినిమా తర్వాతే ప్రేమలేఖలు రాసుకోవడం బాగా ఎక్కువైంది అని చెప్పొచ్చు.
అజిత్, దేవయాని నటించిన ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఈ సినిమాలో అనేక విశేషాలు ఉన్నాయి.ఈ చిత్రంలోని పాటలు ఒక్కోటి ఆణిముత్యం లా ఉంటుంది ఇప్పటికీ కూడా ఆ పాటలు వింటే మైమరచిపోతూ ఉంటారు.మూడు నేషనల్ అవార్డ్స్( National Awards ) సాధించిన ప్రేమలేఖ సినిమా పూర్తిస్థాయిలో పసుపు రంగులో ఉంటుంది ఏ ఫ్రేమ్ చూసినా ఏదో ఒక రూపంలో పసుపు రంగు కనిపిస్తూ ఉంటుంది.
చివరికి ఈ సినిమా టైటిల్స్ కూడా పసుపు రంగులోనే పడతాయి.ఇక ఈ సినిమా 270 రోజులు ఆడింది.అగస్టీయన్ దర్శకత్వంలో తమిళంలో వచ్చిన ఈ సినిమా తెలుగులో అనువాదం చేయబడింది.ఈ సినిమాలో హీరా సైతం ఒక ముఖ్య పాత్రలో నటించింది.
1996లో వచ్చిన ఈ చిత్రం ఇప్పటికీ కూడా ఎంతో మంది ప్రేమికులకు ఆదర్శం ఇలాంటి ఒక అద్భుతమైన ఫీలింగ్ ఇచ్చే సినిమాలు ఈ మధ్యకాలంలో రావడం లేదు.ప్రేమికులకు మరియు ప్రేమకు సరైన నిర్వచనం ఇచ్చే ఈ సినిమా వచ్చి దాదాపు 30 ఏళ్లు గడుస్తున్నా కూడా ఇప్పటికీ దీని గురించి ఎంతోమంది మాట్లాడుకుంటూనే ఉంటారు.ఇక హిందువు అయిన దేవయాని( Devayani ) బైబిల్ లో ఏదో వెతుకుతున్నట్టు ఒక దృశ్యం ఉండడం అప్పట్లో సంచలనం సృష్టించింది ఇది కాస్త కాంట్రవర్సీ అయ్యే టైంకి సినిమా మంచి హిట్ కావడంతో ఆ విషయం పక్కకు వెళ్ళిపోయింది.ఏది ఏమైనా ఆ ప్రేమ లేఖ ఒక అద్భుతమైన కావ్యం.