గిన్నిస్ బుక్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్న మూడడుగుల బుల్లెట్..!

ప్రతిభకు వయసుతో పని లేదని చాలామంది నిరూపించి చూపించారు.అలాగే శరీర దారుడ్యంతో కూడా పని లేదని ఈ కుర్రాడు నిరూపించి చూపించాడు.

 Prateek Vittal Mohithe Won Shortest Body Builder In Guinness World Records, Prat-TeluguStop.com

తనను చూసి నవ్వే ప్రతి ఒక్కరికి సవాల్ విసిరి మరి వారితోనే శభాష్ అనిపించుకున్నాడు ఈ కుర్రాడు.అతను మరెవరో కాదు ప్రతీక్ విట్టల్ మోహితే.

అయితే అతని శరీరమే అతనికి శాపంగా మారింది.ఎందుకంటే ప్రతీక్ అందరిలాగా కాకుండా పొట్టిగా ఉంటాడు.అంటే ప్రతీక్ కేవలం 3.3 అడుగుల ఎత్తు మాత్రమే ఉంటాడు.మహారాష్ట్ర చెందిన ప్రతీక్ ఇప్పుడు ఏకంగా ప్రపంచ గిన్నిస్ రికార్డు కెక్కి అందరిని ఆశ్చర్య పరిచాడు.2022 ఎడిషన్‌ కు సంబంధించిన పోటీల్లో ప్రతీక్ విట్టల్ ప్రపంచలోనే అత్యంత పొట్టి బాడీబిల్డర్‌ గా రికార్డు సంపాదించాడు.

విట్టల్ 3.3 అడుగులు మాత్రమే ఉండడంతో అతన్ని చూసి అందరు ఎగతాళి చేసేవారట.అప్పుడే విట్టల్ మనసులో ఏదన్నా సాధించి అందరిచేత శభాష్ అనిపించుకోవాలనే కసి పెరిగిపోయింది.ఆ పట్టుదలతోనే విట్టల్ బాడీ బిల్డింగ్ చేద్దామని భావించి 2012లో బాడీబిల్డింగ్ మొదలుపెట్టాడు.

అయితే జిమ్ లో ఉండే పరికరాలు ఎంత పెద్దవిగా, బరువుగా ఉంటాయో మన అందరికి తెలిసిందే.ఈ క్రమంలోనే విట్టల్ కూడా జిమ్ పరికరాలు పట్టుకోవడానికి ఇబ్బంది పడేవాడట.

ఆ సమయంలో అతన్ని చూసి జిమ్ లోని వారందరు నవ్వేవారట.వారినవ్వులను, ఎగతాళి మాటలను ఏ మాత్రం పట్టించుకోకుండా తాను అనుకున్నది సాధించాలని ఎంతో పట్టుదలతో శ్రమించి బాడీ బిల్డర్ గా మారాడు.

Telugu Feets, Feet, Guinness, Latest, Prateek, Prateek Mohithe-Latest News - Tel

ఇప్పుడు గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌ ను సొంతం చేసుకున్నాడు.అయితే ప్రతీక్ విట్టల్‌ కు విజయం అనేది అంత సులువుగా ఏమి రాలేదు.అతని కృషి, పట్టుదలను చూసి నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలి అని గిన్నిస్ ఒక కధనంలో ప్రకటించింది.కాగా విట్టల్ గత మూడేళ్లలో మొత్తం 41 పోటీల్లో పాల్గొన్నారు.

అయితే గర్వించదగ్గ విషయం ఏంటంటే.ఒకప్పుడు విట్టల్ ను చూసి ఎగతాళిగా నవ్విన వారే ఇప్పుడు అతన్ని కొన్ని ఈవెంట్లకు అతిథిగా ఆహ్వానిస్తున్నారని విట్టల్ అంటున్నాడు.

ఏది ఏమయినా సాధించాలని పట్టుదలే దృఢంగా ఉంటే ఏదన్నా సాధించవచ్చని.విట్టల్ ను చూసి నేర్చుకోవచ్చని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube