పన్ను చెల్లించడాన్ని గొప్పగా చెప్పుకుంటున్నారా : ఎలన్ మస్క్‌పై ప్రమీలా జయపాల్ విమర్శలు

టెస్లా అధినేత, అపర కుబేరుడు ఎలన్‌ మస్క్‌ తన సంచలన నిర్ణయాలతో పాటు సంపదతోనూ నిత్యం వార్తల్లోనే నిలుస్తారు.తాజాగా కొద్దిరోజుల క్రితం ఈ ఏడాది తాను దాదాపు రూ.85 వేల కోట్ల (11 బిలియన్‌ డాలర్లు) కుపైగానే పన్నుల రూపంలో చెల్లించనున్నట్లు వెల్లడించి ఆశ్చర్యపరిచారు.దీనిపై భారత సంతతికి చెందిన కాంగ్రెస్ సభ్యురాలు ప్రమీలా జయపాల్ మండిపడ్డారు.

 Pramila Jayapal Slams Elon Musk For Bragging About Paying Tax, Elon Musk, Pramil-TeluguStop.com

పన్నులు చెల్లించడాన్ని గొప్పగా చెప్పుకోవడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.రిపబ్లికన్ సెనేటర్ టెడ్ క్రజ్ కూడా ప్రమీలాతో గొంతుకలుపుతూ.

ఎలన్ మస్క్ దేశాన్ని దోపిడీ చేశారంటూ విమర్శించారు.

ఎలన్ మస్క్ ఒక రోజులో 36 బిలియన్ డాలర్లు సంపాదించారని.

కానీ కేవలం 11 బిలిమన్ డాలర్ల పన్ను చెల్లించానని గొప్పగా చెప్పాలనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.కోవిడ్ ప్రారంభమైనప్పటి నుంచి 270 బిలియన్లకు పైగా సంపదను కూడగట్టారంటూ జయపాల్ ఎద్దేవా చేశారు.

సంపన్నులు తమ న్యాయమైన పన్నుల వాటాను చెల్లించాల్సిన సమయం ఆసన్నమైందంటూ జయపాల్ ట్వీట్ చేశారు.దీనిపై సెనేటర్ క్రజ్ స్పందిస్తూ.మీకు ఎలన్ మస్క్ అంటే ఇష్టం లేదన్నది అర్ధమైందన్నారు.అలాగే ఇంకేవరిని దోపిడి చేయాలనుకుంటున్నారంటూ మస్క్‌ను ఆయన ప్రశ్నించారు.

అయితే ఈ ట్వీట్‌లపై టెస్లా అధినేత ఇంత వరకు స్పందించలేదు.

Telugu Covid, Elon Musk, Jayapal Tweet, Person, Pramila Jayapal, Space, Tesla Ce

కాగా… డెమోక్ర‌టిక్ సేనేట‌ర్ ఎలిజ‌బెత్ వారెన్ ఓ ట్వీట్‌లో ఇటీవల మ‌స్క్ వైఖ‌రిని ఖండించారు.ప‌న్ను ఎగవేత‌ను మ‌స్క్ ప్రోత్స‌హించ‌రాద‌ని ట్వీట్ చేశారు.దానికి ఎల‌న్ మ‌స్క్ కౌంట‌ర్ ఇస్తూ.

తాను ఈ ఏడాది 11 బిలియ‌న్ల డాల‌ర్లు ప‌న్ను రూపంలో చెల్లించనున్నట్లు ప్రకటించారు.టెస్లా, స్పేస్ ఎక్స్‌తో రెండు చేతులా సంపాదిస్తున్న ఎల‌న్ మ‌స్క్ ప్ర‌పంచంలోనే ఈ యేటి సంప‌న్న వ్య‌క్తిగా నిలిచారు.

బ్లూమ్‌బ‌ర్గ్ బిలియ‌నీర్ల జాబితా ప్ర‌కారం ఆయ‌న ఆస్తులు 243 బిలియ‌న్ల డాల‌ర్లు.దాంట్లో టెస్లా విలువ ట్రిలియ‌న్ డాల‌ర్ కాగా, స్పేస్ ఎక్స్ విలువ సుమారు 100 బిలియ‌న్ల డాల‌ర్లు.

ఈ క్రమంలోనే టైమ్ మ్యాగ్జిన్ ‘‘ప‌ర్స‌న్ ఆఫ్ ద ఇయ‌ర్’’ అవార్డు గ‌త వార‌మే మ‌స్క్‌ను వ‌రించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube