ప్రభాస్ రాకతో అలెర్ట్ అవుతున్న మేకర్స్.. వరుస షూటింగ్స్ తో బిజీబిజీ!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్( Prabhas ) ఆదిపురుష్ తర్వాత బయట పెద్దగా కనిపించలేదు.అలాగే షూటింగ్స్ కు కూడా బ్రేక్ ఇచ్చేసాడు.

 Prabhas Confirms Return Date Promotional Tour, Prabhas, Prabhas's Health, Prasha-TeluguStop.com

ఇందుకు కారణం అందరికి తెలుసు.ఈ మధ్యనే ప్రభాస్ యూరప్ వెళ్ళి పోయాడు.

ఈయన గత కొంత కాలంగా మోకాలి సమస్య( Knee Problem )తో బాధ పడుతున్నారు.ప్రభాస్ సర్జరీ చేయించడం కోసమే అక్కడికి వెళ్లారు.

రెండు నెలల నుండి అక్కడే ఉంటున్నాడు.అయితే ప్రభాస్ ఎట్టకేలకు రెండు నెలల తర్వాత ఇండియా వస్తున్నట్టు తెలుస్తుంది.


ప్రభాస్ సన్నిహితుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ నవంబర్ 6వ తేదీన ఇండియాకు వస్తారని తెలుస్తుంది.మరి ఎట్టకేలకు రెండు నెలల తర్వాత వస్తున్న ప్రభాస్ ను మేకర్స్ వదిలి పెడతారా.అప్పుడే ప్లాన్స్ రెడీ చేసి పెట్టుకున్నారని తెలుస్తుంది.ముందుగా సలార్ ప్రమోషన్స్ కు సంబంధించి డైరెక్టర్ నీల్ తో భేటీ అవుతారని ఆ తర్వాత మారుతి సినిమా కోసం 10 రోజుల పాటు డేట్స్ ఇవ్వనున్నారని తెలుస్తుంది.

ఈ షెడ్యూల్ పూర్తి కాగానే వెంటనే నాగ్ అశ్విన్ తో కల్కి సినిమా( Kalki Movie ) కోసం రామోజీ ఫిలిం సిటీలో వారం షూట్ జరగనుందట.

ఇది కూడా పూర్తి కాగానే సలార్ ప్రమోషన్స్ లో జాయిన్ అవ్వబోతున్నారని టాక్.మొత్తానికి డార్లింగ్ రావడమే మేకర్స్ ప్లానింగ్ అదిరిపోయేలా ప్లాన్ చేసారు.ఇక సలార్ సినిమా ( Salaar ) కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా కిస్మస్ కానుకగా డిసెంబర్ 22న రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తుంది. ప్రశాంత్ నీల్( Prashanth Neel ) డైరెక్ట్ చేసిన ఈ మూవీలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది.

ఇదైనా బ్లాక్ బస్టర్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube