పవన్ సినిమాలో ఛాన్స్ అందుకున్న పూజా..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడు సంవత్సరాల గ్యాప్ తర్వాత వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.తన కెరీర్ లో ఎప్పుడు లేనంత ఫాస్ట్ గా సినిమాలు చేస్తూ దూసుకు పోతున్నాడు పవన్.

 Pooja Hegde In Pawan Harish Shankar Movie, Pawan Kalyan, Pooja Hegde, Harish Sha-TeluguStop.com

ప్రస్తుతం పవన్ క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు‘ సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమా ఇప్పటికే 30 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.

ఈ సినిమాతో పాటు పవన్ మలయాళంలో సూపర్ హిట్ అయ్యిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాను తెలుగులో భీమ్లా నాయక్ గా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.ఈ మధ్యనే ఈ సినిమా నుండి వచ్చిన ఫస్ట్ గ్లిమ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

పవన్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్స్ అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తున్నాయి.అయితే ఈ సినిమాతో పాటు పవన్ హరీష్ శంకర్ తో కూడా ఒక సినిమాకు ఓకే చెప్పాడు.

ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిన విషయమే.అయితే ఈ సినిమా హీరోయిన్ గురించి ఇప్పుడు చర్చ జరుగుతుంది.

ఈ సినిమాలో పవన్ కు జోడిగా బుట్టబొమ్మ పూజ హెగ్డే నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.ఈ సినిమాలో ప్రియమణి కూడా కీలక పాత్రలో నటిస్తుందని తెలుస్తుంది.

Telugu Bheemla Nayak, Harihara, Harish Shankar, Pawan Kalyan, Pooja Hegde, Pooja

హరీష్ శంకర్ తన ముందు సినిమాలు అయినటువంటి డీజే, గద్దలకొండ గణేష్ సినిమాల్లో కూడా పూజా హెగ్డే నే హీరోయిన్ గా నటించింది.ఇప్పుడు ముచ్చటగా మూడవసారి కూడా హరీష్ పూజా హెగ్డే నే తీసుకోవడం విశేషం.ఇక ఈ సినిమాకు ‘ఇప్పుడే మొదలైంది’, సంచారి అనే రెండు టైటిల్స్ ను పరిశీలిస్తున్నట్టు టాక్.ఈ సినిమా టైటిల్ ను పవన్ పుట్టినరోజు నాడు ప్రకటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి.

మరి పూజాకు ఇది మరొక మంచి అవకాశం అనే చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube