పవన్ 'ప్రత్యేక నిధి' పై ప్రశంసలు ! జనసేన మైలేజ్ పెంచిందిగా ?

జనసేన పార్టీకి రాజకీయ మైలేజ్ తీసుకురావడం లో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అనుకున్న మేర సక్సెస్ అవుతున్నట్టుగానే కనిపిస్తున్నారు.ప్రస్తుతం ఏపీలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు నేరుగా ఆర్థిక సహాయాన్ని అందించేందుకు పవన్ కళ్యాణ్ పర్యటన మొదలు పెట్టారు.

 Pawan Kalyan Has Setup Special Fund For The Education Of Children Of Tenant Farm-TeluguStop.com

ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు.ఈ కార్యక్రమాన్ని సత్యసాయి జిల్లా నుంచి ప్రారంభించారు.

దీనికి పవన్ భారీగానే విరాళం ఇచ్చారు.ఆ విరాళం సొమ్మున నేరుగా అందిస్తున్నారు.

ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే,  మరో పక్క రాజకీయాల్లోనూ సక్సెస్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.

సినిమాల ద్వారా వచ్చిన సొమ్మును పార్టీ కార్యక్రమాల కోసం ఖర్చు పెడుతున్నారు.

ఒక రాజకీయ పార్టీని నడిపించాలంటే ఆషామాషీ వ్యవహారం కాదని,  భారీగా సొమ్ములు ఖర్చు పెట్టాలని అందుకే తాను సినిమాల్లో నటిస్తున్నానని అనేక సందర్భాల్లో పవన్ చెప్పారు.సినిమాల్లో నటిస్తుండడం పై ఎన్నో విమర్శలను ఎదుర్కొంటున్నారు.

ఇక పార్టీ కోసం, ప్రజలకు చేసే సహాయ కార్యక్రమాల కోసం పవన్ సొంత సొమ్ములను ఖర్చు పెడుతున్నారు.  జన సేన నాయకులు ఇదే విధంగా పార్టీకి విరాళాలను అందిస్తున్నారు.

ఇక ఇప్పుడు చూసుకుంటే ఏపీలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలు కోసం పవన్ వ్యక్తిగతంగా 5 కోట్లను విరాళంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
 

Telugu Janasena, Janasenani, Pavan Kalyan, Pavanodarpu, Pavan, Tenant Farmers, Y

తాజాగా మరోసారి భారీ విరాళం ని పవన్ ప్రకటించారు.మరణించిన కౌలు రైతుల కుటుంబాలకు చెందిన పిల్లలకు విద్య అందించేందుకు ప్రత్యేకంగా నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.ఇది జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదలైన కార్యక్రమం కాదని, వెంటనే ఇది అమల్లోకి వస్తుందని పవన్ ప్రకటించారు.

దీనికి అవసరమైన సొమ్ములో సగం డబ్బులు తాను వ్యక్తిగతంగా ఇస్తానని, మిగతాది జనసేన నాయకులు విరాళంగా ఇస్తారని పవన్ ప్రకటించారు.కౌలు రైతుల కుటుంబాలకు వ్యక్తిగతంగా లక్ష రూపాయలు చొప్పున పవన్ ఇప్పటికే అందిస్తున్నారు.

ఇప్పుడు వారి కుటుంబంలోని పిల్లల చదువు నిమిత్తం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తుండటంపై ప్రశంసలు కురుస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube