పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో అద్భుతాలు చేయాలని భావిస్తుండగా ఏపీలో ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ స్థాయిలో జనసేన పుంజుకోలేదు.అయితే తన పార్టీకి ఓట్లు రాకపోవడం గురించి అన్ స్టాపబుల్ షోలో పవన్ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అభిమానం వేరు అని అది ఓట్లుగా మారడం వేరని పవన్ కళ్యాణ్ కామెంట్లు చేశారు.అభిమానం ఓట్లుగా మారాలంటే దశాబ్దాలు కష్టపడాలని పవన్ కళ్యాణ్ అన్నారు.
సినిమా రంగంలో నాకు పేరు తెచ్చుకోవడానికి పదేళ్ల సమయం పట్టిందని పవన్ కళ్యాణ్ తెలిపారు.పాలిటిక్స్ లో సక్సెస్ కావడానికి కూడా అదే స్థాయిలో కృషి చేయాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
అలా చేస్తే మాత్రమే అభిమానం ఓట్లుగా మారడం సాధ్యమవుతుందని ఆయన కామెంట్లు చేశారు.ప్రజలకు మనపై నమ్మకం కలగాలంటే గట్టిగా నిలబడాలని రాత్రికి రాత్రే ఏదీ జరిగిపోదని పవన్ కళ్యాణ్ కామెంట్లు చేశారు.
తక్కువలో తక్కువ 15 సంవత్సరాల సమయం పడుతుందని ప్రస్తుతానికి నేను నమ్మకాన్ని సంపాదించుకునే పనిలో ఉన్నానని ఆయన కామెంట్ చేశారు.90 నిమిషాల నిడివితో ఈ ఎపిసోడ్ ప్రసారం కాగా తన ఫ్యాన్స్ అంతా తనకు ఓట్లేయడం లేదని పవన్ పరోక్షంగా చెప్పుకొచ్చారు.అన్ స్టాపబుల్ షో పవన్ కు పొలిటికల్ గా కొంతమేర కలిసొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.
పవన్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.హరిహర వీరమల్లు 60 శాతం షూట్ పూర్తి కాగా వీలైనంత వేగంగా ఈ సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేయాల్సిన బాధ్యత పవన్ పై ఉంది.సినిమా సినిమాకు పవన్ కు క్రేజ్ పెరుగుతుండగా పవన్ సినిమాలకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరుగుతుండగా ఈ ఏడాది పవన్ నటించిన మూడు సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయని సమాచారం అందుతోంది.