మెగా హీరోలైన పవన్ కళ్యాణ్, చిరంజీవి( Chiranjeevi )వంటి హీరోలు ఒక సినిమా తీస్తున్నారు అంటే ఓటీటిలు భయపడే పరిస్థితులు వచ్చాయి.వారి పేరు చెప్పగానే సినిమాలు కొనడం సంగతి పక్కన పెడితే మళ్లీ అటువైపు చూడకూడదు అన్న విధంగా ప్రస్తుతం ఓటీటిలు పని చేస్తున్నాయి.
అందుకు అనేక కారణాలు ఉన్నాయి.ఎందుకంటే మెగా హీరోలు ఎక్కువగా రీమేకులపై పని చేయడమే దానికి గల ముఖ్య కారణం.
అప్పటికే తీసిన ఓ సినిమాను రీమేక్ చేయడం అనేది సెకండ్ గ్రేడ్ కింద చూసేవారు గతంలో.ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
ఒక సినిమా సొంత కథతో ఏ భాషలో అయినా విడుదల అయింది అంటే చాలు దానికి మిగతా అన్ని భాషలో రీమేక్ లు చేయడం లేదా డబ్బింగ్ చేసి వదలడమా ఏదో ఒకటి చేస్తున్నారు.
ఉదాహరణకు మొన్నటికీ మొన్న భోళాశంకర్( Bhola Shankar ) అనే ఒక సినిమా వచ్చింది.ఇందులో చిరంజీవి హీరోగా కనిపించాడు.కానీ ఇది వేదాళం సినిమాకు రీమేక్ కాబట్టి ఇప్పటికే దాన్ని ఓటిటిలో, యూట్యూబ్ లో ఎక్కడపడితే అక్కడ రకరకాల సందర్భాల్లో కనీసం ముక్కలు ముక్కలుగా అయినా దాన్ని చూసేశారు.
అందుకే భోళా శంకర్ ని కొనడానికి ఓటీటిలు ధైర్యం చేయడం లేదు.బ్రో సినిమా కథ వినోదయ సీతం చిత్రానికి రీమేక్ గా విడుదలైంది.వినోదయ సీతం ఇప్పటికే అన్ని ప్లాట్ఫామ్స్ లో విడుదల అయింది.మళ్ళీ దాన్ని కొత్తగా చూసే అవసరం ఏముంటుంది చెప్పండి.
పెద్ద హీరోల సినిమాలు తక్కువ డబ్బులకు అమ్మడానికి లేదు కాబట్టి కోట్లకు కోట్లు ఇవ్వాలని సినిమా మేకర్స్ భావిస్తున్నారు.కానీ అప్పటికే చూసి రొట్ట కొట్టుడు కొట్టిన సినిమాను మళ్ళీ కోట్ల రూపాయలు పెట్టి ఎందుకు కొనుక్కుంటారు చెప్పండి.
ఇప్పుడు ఉన్న ఓటీటి పరిస్థితిల ప్రకారం క్లీన్ కథలు కావాలి, ఫ్రెష్ గా ఆలోచించగలిగాలి.ఒక బేబీ, ఒక మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి( Baby ) వంటి సినిమాలకు మార్కెట్ ఉంది.అలాంటి సినిమాలోనే చూడాలని ఓటీటిలో ఎగబడి చూస్తున్నారు.కాబట్టి పెద్ద హీరోల సినిమాల కన్నా కూడా హిట్ సినిమాలు పైగా సొంత కథలైతే ఎక్కువగా డిమాండ్ ఉండే అవకాశం ఉంటుంది.
ఒక పుష్ప, ఒక ఆర్ఆర్ఆర్ సినిమాలకు డిమాండ్ అయితే ఉంది అందుకే హిట్టు కొట్టిన బ్రో కానీ ఇంకేదైనా తమిళ రీమిక్స్ లేదా మలయాళ రీమేక్ అయినా కూడా ఓటీటి నుంచి పిలుపు అందుకోవడం లేదు.ముఖ్యంగా మెగా హీరోలు ఎక్కువగా ప్రేమికులు తీస్తున్నారు కాబట్టి వారి సినిమాల జోలికి అస్సలు వెళ్లడం లేదు.