ఈ నెల మూడో తారీఖున ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రాంతంలోని మారళ్లగుంటవారి పాలెం పొలాల్లో గుర్తుతెలియని తల్లీబిడ్డల శవాలు లభించిన విషయం తెలిసిందే.అయితే ఈ విషయమై పెద్దకొత్తపల్లి విఆర్వో షేక్ ఆరిఫా పోలీసులకు సమాచారం ఇచ్చి కేసు నమోదు చేశారు.
అయితే ఈ పోలీసుల విచారణలో భాగంగా మొదటిగా మృతుల ఆ చూకిని కనుగొన్నారు.ఈ నేపథ్యంలో మృతురాలు ఒంగోలులోని ఓ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఫార్మసిస్ట్ గా పనిచేస్తున్న అద్దంకి కోటేశ్వరరావు భార్య శ్రీ లక్ష్మీ మరియు చిన్నారి గుర్తించారు.
అయితే అసలు మృతి లక్ష్మి చనిపోవడానికి గల కారణాలు ఏమిటని ఆరా తీస్తుండగా పోలీసులు విస్తుపోయే నిజాలు కనుగొన్నారు.ఈ రోజు కేసును చేదించి ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ కేసు వివరాలను మీడియా ముందుకు తెచ్చారు.
నిందితుడు అద్దంకి కోటేశ్వరరావు కజకిస్తాన్ లో ఎంబిబిఎస్ చదువుకొని తిరిగి వచ్చి ఒంగోలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో మైనర్ బాలిక అయినటువంటి శ్రీ లక్ష్మి తో ప్రేమలో పడ్డాడు.
అయితే ఆమెను పెళ్లి చేసుకునేందుకు కోటేశ్వరరావు తల్లిదండ్రులు అంగీకరించలేదు.దీంతో గత సంవత్సరం ఏప్రిల్ నెలలో తమ పెద్దల ఎదురిం నీచి శ్రీ లక్ష్మీ కోటేశ్వరరావు పెళ్లి చేసుకున్నాడు.
వీరికి ఈ ఏడాది జనవరి నెలలో వైష్ణవి అనే పాప జన్మించింది.
అయితే తమ తల్లిదండ్రుల అధిష్టానానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్న కోటేశ్వరరావు రోజూ తనలోతానే మొదలు పడుతూ ఉండేవాడు.దీనికి తోడు శ్రీలక్ష్మి పై అనుమానం పెంచుకున్నాడు.దీంతో భార్య బిడ్డనీ అడ్డు తొలగించుకోవడానికి పథకం పన్నాడు.
ఈ క్రమంలో లో శ్రీ లక్ష్మీ తో బ్యాంకులో పని ఉంది అని చెప్పి ఆమెను మరియు కూతురు వైష్ణవిని తీసుకెళ్లి మార్గమధ్యంలో దారుణంగా గొంతు కోసి చంపేశాడు.అనంతరం తన వద్ద తెచ్చుకున్న పెట్రోలు పోసి రెండు శవాలను తగులబెట్టాడు.
తర్వాత ఏమీ ఎరగనట్టు తను పని చేస్తున్న ఆసుపత్రికి వెళ్లిపోయాడు.అయితే భార్య బిడ్డలు కనిపించడం లేదని ఏమాత్రం బాధ లేకుండా ఉన్న అతడిపై పోలీసులకు అనుమానం వచ్చి అతన్ని విచారించగా ఇంతటి దారుణానికి ఒడిగట్టింది తనను తెలుసుకొని పోలీసులు విస్తుపోయారు.
అనంతరం నిందితుడిపై పలు రకాల కేసుకి సంబంధిత సెక్షన్లు మోపి కేసు నమోదు చేసుకుని రిమాండ్ కి తరలించారు.
.