సినిమా అనే రంగుల ప్రపంచంలోకి ఒకసారి అడుగు పెట్టి పాపులారిటీ సంపాదించిన తర్వాత ఇక సెలబ్రిటీలు ఏం చేసినా కూడా అది ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారి పోతూనే ఉంటుంది.ఎప్పుడు ఎక్కడికి వెళ్ళిన ఏదో ఒక కెమెరా వారిని చూస్తూనే ఉంటుంది.
ఇక ఇలా సినీ సెలబ్రిటీలు అందరూ కూడా పర్సనల్ లైఫ్లో స్వేచ్ఛని కోల్పోతారని చెప్పాలి.ఇలా అప్పట్లో తన పర్సనల్ లైఫ్ తో సంచలనం గా మారిపోయిన నటి లక్ష్మి.
ఇటీవల కాలంలో వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది నటి లక్ష్మి.అప్పట్లో తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా కూడా ఎన్నో సినిమాల్లో నటించింది.1975లో జూలీ అనే బాలీవుడ్ సినిమాలో నటించి మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది.
ఇక మొదటి సినిమాలోనే పాత్రతో ఫిలింఫేర్ అవార్డును కూడా దక్కించుకున్నారు లక్ష్మి.
పదిహేనేళ్ల నుంచి సినిమాల్లో నటిస్తూ వస్తున్న లక్ష్మి ఇప్పటివరకు 400కు పైగా సినిమాల్లో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు అప్పట్లో మూడు పెళ్లిళ్లతో లక్ష్మీ జీవితం అప్పట్లో ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.సినిమాల్లోకి వచ్చిన సమయంలో 17 ఏళ్లకే పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంది.
భాస్కర్ అనే తీసేయడం కంపెనీలో పనిచేసే వ్యక్తిని పెళ్లి చేసుకున్న లక్ష్మి ఒక పాప పుట్టిన తర్వాత అతనితో విడాకులు తీసుకుంది.తర్వాత తన సహ నటుడు మోహన్ ని పెళ్ళిచేసుకున్నారు.ఇక వీరి బంధం ఎక్కువ రోజులు నిలువలేదు.తర్వాత విడాకులు తీసుకున్నారు.
ఆ తర్వాత నటుడు దర్శకుడు శివ చంద్రన్ ను పెళ్లాడింది.లక్ష్మీ తండ్రి నెల్లూరు జిల్లాకు చెందిన వై వి రావు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సాంఘిక నేపథ్య సినిమాలకు దర్శకత్వం వహించటమే కాదు పలు సినిమాల్లో నటించారు.ఇక లక్ష్మీ తల్లి రుక్మిణి కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటిందట.దాదాపు వంద సినిమాల్లో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.
మూడు సంవత్సరాల వయసు నుండే బాలనటిగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఆమె 40 సినిమాల్లో బాలనటిగా నటించింది.తెలుగు తమిళ కన్నడ సినిమాల్లో నటించి అలరించింది.శ్రీవల్లి అనే సినిమాతో తొలిసారిగా కథానాయకగా ఇండస్ట్రీకి పరిచయమైందట.