నాగ చైతన్య ఈ సంవత్సరంలో ఇప్పటికే బంగార్రాజు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.ఈ ఏడాది ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బంగార్రాజు సూపర్ హిట్ దక్కించుకుంది.
ఇక నాగ చైతన్య మరియు విక్రమ్ కుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన థాంక్యూ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా విడుదల ఎప్పుడెప్పుడా అంటూ అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ సమయంలో థ్యాంక్యూ సినిమా కంటే ముందు నాగ చైతన్య మరియు విక్రమ్ కె.కుమార్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన దూత అనే వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గత కొన్ని నెలలుగా ఈ వెబ్ సిరీస్ సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి.కానీ ఇప్పటి వరకు అధికారిక ప్రకటన అనేది ఈ వెబ్ సిరీస్ గురించి రాలేదు.
ఎట్టకేలకు ఈ వెబ్ సిరీస్ ను నిర్మిస్తున్న అమెజాన్ ప్రైమ్ అధికారిక ప్రకటన చేసింది.ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ముగింపు దశకు వచ్చిందని, అతి త్వరలోనే స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన చేయడం జరిగింది.
షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సమయం లో ఈ వెబ్ సిరీస్ అధికారిక ప్రకటన రావడంతో అక్కినేని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వెబ్ సిరీస్ లో నాగచైతన్య నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు అంటూ మొదటి నుంచి వార్తలు వస్తున్నాయి.నాగ చైతన్య ఇప్పటి వరకు కనిపించిన విభిన్నమైన గెటప్ లో మరియు పాత్రలో ఈ వెబ్ సిరీస్ లో చైతూ కనిపించబోతున్నారని తెలుస్తోంది.వెబ్ సిరీస్ కి సంబంధించినంత వరకు షూటింగ్ కార్యక్రమాలు జరిగుతున్నాయి.
పూర్తి థ్రిల్లర్ ఎలిమెంట్స్తో వెబ్ సిరీస్ ఉంటుందని ఇప్పటికే యూనిట్ వర్గాల వారు తెలియజేశారు.కనుక కచ్చితంగా నాగ చైతన్య కెరీర్లో చాలా ప్రత్యేకమైనది గా ఈ వెబ్ సిరీస్ నిలుస్తుందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.