తెలుగు చిత్ర పరిశ్రమ లో అలనాటి నటి లక్ష్మీ గురించి తెలియని వారంటూ ఉండరు.తనదైన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది.
అత్తల, అమ్మ, బామ్మల అక్క ఇలా ఎన్నో క్యారెక్టర్ లో ఒదిగిపోయింది ఈ భామ.ఇక ఎన్టీఆర్ గా లక్ష్మీ ఎన్నో సినిమాలో నటించారు.ఇక దివంగత గొప్ప నటుడు అప్పటి ముఖ్యమంత్రి అయిన నందమూరి తారక రామారావు ఎంత క్రమశిక్షణ కలిగిన వ్యక్తో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ముఖ్యంగా ఆయన హీరోగా సినిమాల్లో నటిస్తున్నప్పుడు షూటింగ్ ఉదయం 9 గంటలకు అని డైరెక్టర్ చెబితే అంటే ఉదయం 8:45 కల్లా మేకప్ వేసుకుని రెడీ గా ఉండేవారు.ఆయన డెడికేషన్ వల్ల చాలా మందికి ఇబ్బందులు కూడా ఎదురయ్యేవి.అలా ఎన్టీఆర్ వల్ల ఇబ్బంది పడిన వారిలో అప్పటి హీరోయిన్ లక్ష్మీ కూడా ఒకరు.అంతేకాదు.ఎన్టీఆర్ కు జోడీగా లక్ష్మీ మొదటిసారి ‘ఒకే కుటుంబం’ అనే సినిమాలో నటించింది.
ఆ సినిమా షూటింగ్ టైములో నటుడు కాంతారావు ఓరోజు ఆలస్యంగా సెట్ కు వచ్చాడు.దాంతో ఎన్టీఆర్ సీరియస్ అయ్యారు.
సెట్ లో ఉన్నవాళ్ళంతా ఆయన్ని చూసి వణికిపోయారు.అందులో లక్ష్మీ గారు కూడా ఒకరు.
అయితే ఎన్టీఆర్ తో మొదటి సినిమా చేస్తున్నప్పుడు.లక్ష్మీ గారు ఏ రోజు కూడా షూటింగ్ కు ఆలస్యంగా రాలేదు.
కానీ రెండో సినిమా చేస్తున్న టైంలో అనుకోకుండా ఒకరోజు లేట్ అయ్యింది.
అయితే కాంతారావు ఇన్సిడెంట్ గుర్తుకొచ్చి ఎన్టీఆర్ వద్దకు ఆమె భయపడుతూ వెళ్ళి ఆలస్యం అయినందుకు క్షమాపణలు కోరింది.అందుకు ఎన్టీఆర్ నవ్వుతూ.‘ఇట్స్ ఆల్ రైట్, రండి కూర్చోండి’ అని చెప్పి.
‘ఇంటి దగ్గరి నుండీ వచ్చిన ఈ టిఫిన్ అంతా మీరే తినాలి లేటుగా వచ్చినందుకు ఇది మీకు శిక్ష’ అంటూ చెప్పారట.అలా చిన్న ఫన్నీ శిక్షతో లక్ష్మీ, ఎన్టీఆర్ చేతిలో బుక్కై పోయినట్టు చెప్పుకొచ్చింది లక్ష్మి.