నందమూరి తారక రామారావు కి తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఆయన భౌతికంగా దూరమై ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో మాత్రం సజీవంగానే ఉన్నారు అని చెప్పాలి.
ఇక అప్పట్లో ఈ ఏ హీరోకి అందనంత ఎత్తులో కొనసాగారు నందమూరి తారకరామారావు. ఇక అప్పట్లో ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆయన సినిమా ప్రారంభం అవుతుంది అంటే చాలు ఇండస్ట్రీ లో ఉండే హడావిడి అంతా ఇంతా కాదు అనే చెప్పాలి.
ఒక రకంగా చెప్పాలంటే ఇక షూటింగ్ స్పాట్ మొత్తం పండుగ వాతావరణాన్ని సంతరించుకునేది.
అయితే సినిమా రంగంలో ఎంతో మంది తమ సినిమాల విషయంలో కొన్ని సెంటిమెంట్లు బాగా ఫాలో అవుతూ ఉంటారు.
అచ్చంగా ఇలాగే ఎన్టీఆర్ కూడా తన కెరీర్లో ఎన్నో సెంటిమెంట్లను ఫాలో అయ్యారు అన్న విషయం తెలిసిందే.ఇప్పుడు ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ సైతం కొన్ని అలవాట్లను సెంటిమెంట్ లను ఇప్పటికీ ఫాలో అవుతున్నారు.
అయితే అప్పట్లో ఎన్టీఆర్ ఏ బ్యానర్ పై సినిమా చూసిన ఒక సెంటిమెంట్ ఉండేదట.ఆయన సోదరుడు తోనే కొబ్బరికాయ కొట్టించేవాడట.ఎన్టీఆర్ సోదరుడైన త్రివిక్రమరావు అన్న ప్రోత్సాహంతో నిర్మాతగా ఎదిగి నిలదొక్కుకున్నారు.
ఇక వీరిద్దరూ ఒకరి పట్ల ఒకరు అమితమైన ప్రేమాభిమానాలను కలిగి ఉండేవారు.
అప్పట్లో వీరిని రామలక్ష్మణులు అంటూ కూడా కొంతమంది పిలిచేవారట.ఇక ఎన్టీఆర్ కు తమ్ముడు అంటే పంచప్రాణాలు.అంతే కాదు తమ్ముడు అంటే ఒక సెంటిమెంట్ కూడా.అందుకే ఆయన ఏ సినిమా ప్రారంభించిన కూడా తమ్ముడు త్రివిక్రమరావు తోనే కొబ్బరికాయ కొట్టించేవాడట ఎన్టీఆర్.అంతే కాదు త్రివిక్రమరావు ను గోల్డ్ బ్రదర్ అంటూ సంబోధించే వాడట.ఇక త్రివిక్రమరావు సైతం అటు ఎన్టీఆర్ సినిమా వ్యవహారాల నుండి దగ్గరుండి ఎంతో శ్రద్ధగా చేసుకునేవాడట.
ఆ తర్వాత కాలంలో ఏన్ టి అనే ఒక ప్రొడక్షన్ హౌస్ స్థాపిస్తున్నాడు త్రివిక్రమ్ రావు.నిర్మాతగా ఎన్నో సినిమాలు కూడా తీశారు.