ప్రస్తుతం భారత ప్రధాని నరేంద్ర మోదీ( PM Narendra Modi ) అమెరికాలో పర్యటిస్తున్నారు.అమెరికా ( America ) కాలమానం ప్రకారం, మంగళవారం న్యూయార్క్‌లో అడుగుపెట్టిన మోదీకి ప్రవాస భారతీయుల నుంచి ఘన స్వాగతం లభించింది.
న్యూయార్క్‌లో మోదీ పర్యటన సందర్భంగా బస చేయనున్న హోటల్ లోటే వద్దకు రాగానే ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ జెండాలు ఊపారు.తరువాత ప్రధాని బోరా కమ్యూనిటీ, ఇతర భారతీయ ప్రవాస సభ్యులతో సమావేశమయ్యారు.
సీఈవోలు, నోబెల్ గ్రహీతలు, ఆర్థికవేత్తలు, కళాకారులు, శాస్త్రవేత్తలు, మేధావులు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, ఆరోగ్య రంగ నిపుణులతో మంగళవారం ఆయన సమావేశం కానున్నారు.
మోదీకి స్వాగతం పలికే సమయంలో యునైటెడ్ స్టేట్స్‌లోని భారతీయ ప్రవాసుల్లోని ఓ సభ్యుడు ప్రధాని నరేంద్ర మోదీ ఇమేజ్‌లతో ఉన్న ప్రత్యేకమైన నెహ్రూ జాకెట్‌ను( Nehru Jacket ) ధరించి కనిపించారు.మరికొంతమంది కూడా మోదీ బొమ్మ ఉన్న నెహ్రూ జాకెట్లు ధరించి ఆశ్చర్యపరిచారు.దీన్ని బట్టి ఎన్నారై లలో మోదీ పట్ల ఎంత అభిమానం ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇక ప్రధాని మోదీ జూన్ 21న ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొని, అనంతరం వాషింగ్టన్ డీసీకి వెళ్తారు.జూన్ 22న వైట్‌హౌస్‌లో ఆయనకు లాంఛనంగా స్వాగతం పలుకుతారు.అదే రోజు యూఎస్ కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రసంగిస్తారు.జూన్ 23న అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌లతో కూడా భేటీ కానున్నారు.
కాగా మోదీ పర్యటనకు ఇటు ఇండియాలోనే కాకుండా అటు అమెరికాలో కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.