నిజామాబాద్‌ డీసీకి తృటిలో తప్పిన ప్రమాదం.. !

రోడ్దు ప్రమాదం జరిగితే బతికి బట్టకట్టడం మాట అటుంచితే భరించలేని గాయాలతో బయట పడవలసి వస్తుంది.ఒక్కొక్క సారి అంగవైకల్యం కూడా సంభవించవచ్చూ.

 Nizamabad Dc Narrowly Missed Accident, Nizamabad, Municipal, Deputy Commissioner-TeluguStop.com

కానీ అదృష్టం బాగుంటే మాత్రం చిన్న చిన్న గాయాలతో బతకవచ్చూ.ఇలా జరగడం చాలా తక్కువ అని పేర్కొనవచ్చూ.

ఇకపోతే చూడటానికి ఘోరంగా కనిపిస్తున్న ప్రమాదంలో నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ డిప్యూటీ కమిషనర్‌ తృటిలో బయటపడ్డారట.మున్సిపల్‌ కమిషనర్‌ ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడటంతో, కమీషనర్‌తో పాటుగా కారు డ్రైవర్‌, మరో నలుగురు గాయపడ్డారని సమాచారం.

కాగా నిజామాబాద్‌ నుంచి సాయిపేట వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగినట్లుగా తెలియచేస్తున్నారు.

ఇకపోతే ప్రమాద ధాటికి కారు ముందుటై రు విరిగి దూరంగా పడిపోగా ఈ ప్రమాదంలో చిక్కుకున్న రవిబాబు, కారు డ్రైవర్‌ హర్బజ్‌ ఖాన్‌, మరో నలుగురికి గాయాలయ్యాయని, సమయానికి అక్కడున్న స్దానికులు ప్రమాదాన్ని గ్రహించి వీరందరిని కాపాడి సమీపంలోని ఆస్పత్రికి తరలించడంతో ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారుట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube