తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరోయిన్ నిత్యా మీనన్( Nithya menen ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.నిత్యా మీనన్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
మొదట అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, మళ్లీ ఇది రాని రోజు, భీమ్లా నాయక్ లాంటి సినిమాలలో నటించి మెప్పించింది.వీటితో పాటుగా గీతా గోవిందం సన్నాఫ్ సత్యమూర్తి( Gunde Jaari Gallanthayyinde ) లాంటి సినిమాలలో హీరో హీరోయిన్ లకు ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించింది.
అలా ఈమె తెలుగుతో పాటు తమిళం, మలయాళ బాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు వెబ్ సిరీసుల్లో నటిస్తూ అలరిస్తోంది.ఇటీవలే కుమారి శ్రీమతి అనే వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.తాజాగా ఆమె ప్రధాన పాత్రలో నటించిన మలయాళ వెబ్ సిరీస్ మాస్టర్ పీస్ కూడా స్ట్రీమింగ్‌కి సిద్ధంగా ఉంది.
ఈ వెబ్ సిరీస్‌లో ఆమె రియా అనే గృహిణి పాత్రలో నటించింది.రీల్ లైఫ్‌లో గృహిణిగా ఆకట్టుకున్న నిత్య రియల్ లైఫ్‌లో తనకు ఎలాంటి భర్త కావాలని అనుకుంటుందో చెప్పింది.
తాను పక్కా ట్రెడిషనల్ అని, మన సంస్కృతి సాంప్రదాయాలను ఎక్కువగా గౌరవిస్తాను.అయితే పెళ్లి విషయంలో నాకు ఒక అభిప్రాయం ఉంది.
మ్యారేజ్ అనేది సోషల్ అండ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీతో ముడిపడి ఉన్న సెటప్ అని, తనకు అలాంటి సెక్యూరిటీ అవసరం లేదని చెప్పుకొచ్చింది నిత్యా మీనన్.( Nithya menen ) అంతకు మించి ఆలోచించే వాళ్లు దొరికితే తప్పకుండా పెళ్లి చేసుకుంటానని నిత్యామీనన్ తెలిపింది.ఇకపోతే నిత్యామీనన్ తెలుగులో చివరగా భీమ్లా నాయక్ సినిమా( Bheemla nayak )తో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తమిళ సినిమాలలో నటిస్తూ బిజీబిజీగా గడిపింది.