డైరెక్టర్ వెంకీ అట్లూరీ, స్టార్ హీరో ధనుష్ కాంబినేషన్ లో తాజాగా తెరకెక్కిన చిత్రం సార్.సినిమా విడుదలకు ముందే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే.
ఇక తాజాగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను అందుకుంది.విద్యావ్యవస్థ లో లోపాలను ఎత్తి చూపే విధంగా ఉండనున్న విషయం తెలిసిందే.
అయితే సినిమా విడుదలకు ముందే విడుదలైన పాటలకు ట్రైలర్ కి ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
ఇక ఇందులో ధనుష్ తనదైన యాటిట్యూడ్, స్టైల్ తో అదరగొట్టినట్లు తెలుస్తోంది.అంతేకాకుండా ధనుష్ తెలుగులో స్ట్రెయిట్ గా చేసిన తొలి తెలుగు సినిమా కూడా ఇదే.దాంతో టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ సార్ సినిమా యూనిట్ కి విషెస్ చెబుతూ ట్వీట్ చేశాడు.రేపటి నుంచి సార్ థియేటర్స్ లో సందడి చేయబోతున్నారు.
ఆల్రెడీ చిత్రం గురించి గొప్ప విషయాలు తెలుస్తున్నాయి.డియర్ స్వామి వెంకీ అట్లూరికి కంగ్రాట్స్.
ధనుష్ గారికి తెలుగు లోకి గ్రాండ్ వెల్ కమ్ చెబుతున్నాను సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ, చిత్ర యూనిట్ మొత్తానికి నా శుభాకాంక్షలు అంటూ నితిన్ ట్వీట్ చేశారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇకపోతే వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ నటించిన రంగ్ దే చిత్రం మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.ఆ విధంగా నితిన్, వెంకీ మధ్య మంచి సాన్నిహిత్యం కూడా ఉంది.
ఇక సార్ చిత్రంలో ధనుష్ కి జోడిగా భీమ్లా నాయక్ హీరోయిన్ సంయుక్త మీనన్ నటించిన విషయం తెలిసిందే.మొదటిసారి తెలుగు సినిమాతో డైరెక్ట్ గా తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న హీరో ధనుష్ కి సార్ మూవీ ఏ మేరకు సక్సెస్ పెడుతుందో చూడాలి మరి.