వన్ మిలియన్ క్లబ్ లో చేరిన నితిన్

సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి పదేళ్లకు పైగా కెరియర్ ని పూర్తి చేసుకున్న యువ హీరో నితిన్.కెరియర్ ఆరంభంలో హ్యాట్రిక్ హిట్స్ కొట్టి తరువాత కమర్షియల్ఫార్ములా అంటూ తనకి సెట్ అవ్వని కథలతో సినిమాలు చేసిన నితిన్ ఏకంగా ఏడేళ్ల పాటు హిట్ మొహం చూడలేదు.అతను చేసిన ప్రతి సినిమా డిజాస్టర్ అవుతూ వచ్చింది.అయితే విక్రమ్ కె కుమార్ తో ఇష్క్ సినిమా చేసి మళ్ళీ హిట్ కొట్టి గాడిలో పడ్డ నితిన్ వెంటనే గుండె ఝారీ గల్లంతయ్యిందే సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.

 Nithiin Reaches 1 Million On Instagram, Tollywood Heroes, Youth Star Nithin, Cel-TeluguStop.com

అప్పటి నుంచి కెరియర్ లో ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాడు.తనకి సెట్ కానీ కమర్షియల్ ఫార్ములా కథల జోలికి వెళ్లకుండా కొత్తదనం ఉన్న కథలు, రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ లతో సందడి చేస్తున్నాడు.

ఆ మధ్యలో ఫ్లాప్స్ వచ్చిన మరల భీష్మ సినిమాతో సాలిడ్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇప్పుడు ఏకంగా నాలుగు సినిమాలని లైన్ లో పెట్టి ఉంచాడు.

అందులో ఒకటైన రంగ్ దే సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కి కూడా రెడీ అవుతుంది.ఇది కూడా రొమాంటిక్ ఎంటర్టైనర్ గానే తెరకెక్కుతుంది.

ఇదిలా ఉంటే ఈ మధ్య లవ్ స్టోరీ కథలతో యూత్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతున్న నితిన్ ని సోషల్ మీడియాలో ఫాలోయింగ్ బాగానే పెరుగుతుంది.తాజాగా నితిన్ ఇన్స్టాగ్రామ్ లో వన్ మిలియన్ ఫాలోవర్స్ క్లబ్ లో చేరాడు.

ఈ స్థాయిలో ఫాలోవర్స్ అంటే చాలా గొప్ప విషయం.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హీరోల జాబితాలో ఇప్పుడు నితిన్ కూడా చేరిపోయాడు.

ఈ సందర్భంగా నితిన్ అభిమానులు 1మిన్ ఇస్టా లవ్ ఫర్ నితిన్ అంటూ ప్రచారం హోరెత్తిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube