కొన్ని ఘటనలు ఎంత చూసినా సరే మన కండ్లను మనమే నమ్మలేం.ఇంకొన్ని ఘటనలు అయితే విన్నాకూడా నమ్మలేకుండా ఉంటాం.
ప్రత్యక్ష సాక్ష్యులు అలాంటివి చూసి చెప్పినా నిజం కాదేమో అని అనుమానం కలుగుతుంది.ఇంకొన్ని ఘటనలు అయితే వీడియోలు చూసినా నమ్మబుద్ధి కాదు.
అసలు అలా జరుగుతుందా అనే అనుమానాలు కలుగుతుంటాయి.ఇప్పుడు కూడా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది.
అయితే దీని గురించి వింటే మాత్రం మీ ఫ్యూజులు ఎగిరిపోతాయి.ఎందుకంటే ఇలాంటి ఘటనలు కూడా జరుగుతాయా అని అనిపించక మానదు.
యూపీలోని ఖుషీనగర్ ఊరులో ఉండే తొమ్మిది ఏండ్ల రోష్ని చిన్నప్పటి నుంచే కడుపునొప్పి వస్తోంది.ఆమెను ఎంతమందికి చూపించినా కడుపు నొప్పి మాత్రం తగ్గట్లేదు.
ఒకసారి తగ్గడం మళ్లీ పెరగడం ఇలాగే జరుగుతోంది.దీంతో ఆమెను ఎంతోమంది డాక్టర్లకు చూపించారు.
ఇక చేతబడి చేశారేమో అని భూత వైద్యులకు కూడా చూపించాడు.అయినా సరే అలాగే తొమ్మిదేండ్లు వచ్చేదాకా కడుపు నొప్పి ఇంకా పెరుగుతూనే ఉండటంతో ఆమెను ముంబైలోని సియాన్ హాస్పిటల్ లో చూపించారు.
వారు ఆమెకు సోనోగ్రఫి టెస్టులు చేసి మైండ్ బ్లాంక్ అయ్యే న్యూస్ చెప్పారు.

ఆమె కడుపులో తల, కాళ్లు, చేతులు ఉన్న ఓ మృత శిశువు పెరుగుతోందని, చిన్నప్పటి నుంచే ఇది ఆమె కడుపులో క్రమంగా పెరగడం వల్ల ఇలా కడుపునొప్పితో బాధపడుతోందని వారు తేల్చారు.ఇక డాక్టర్లు ఆమెకు సర్జరీ చేసి ఆ మృత శిశువును తొలగించారు.ఇక నుంచి ఆ బాలిక అందరిలాగే హాయిగా గడపొచ్చని చెప్పారు.
భవిష్యత్ లో ఎలాంటి ఇబ్బందులు ఉండవని వివరించారు.కడుపులో రూపుదిద్దుకుంటున్న సమయంలోనే ఇంకో శిశువులోకి జారిపోవడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతుతాయని వారు వివరించారు.