కార్తికేయ 2 హిట్ ఆ సినిమాకు వరంగా మారిందా.. నక్క తోక తొక్కినట్టే!

కార్తికేయ 2 పేరు ఇప్పుడు దేశం అంతటా మారుమోగి పోతుంది.నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా కార్తికేయ 2.

 Nikhil Siddharth 18 Pages Movie Latest Update, 18 Pages Movie, Nikhil Siddharth,-TeluguStop.com

నిఖిల్ కెరీర్ లోనే కార్తికేయ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది అనుకుంటే ఇప్పుడు దీనికి సీక్వెల్ గా వచ్చిన కార్తికేయ 2 అంతకంటే బ్లాక్ బస్టర్ తో భారీ వసూళ్లు రాబడుతుంది.

చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చడంతో సూపర్ హిట్ అయ్యింది.

ఆగష్టు 13న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యిన ఈ సినిమా ఎవ్వరూ ఊహించని విధంగా బాలీవుడ్ లో వండర్ క్రియేట్ చేస్తుంది.ఇక ఇదే సమయంలో కార్తికేయ సినిమా హిట్ వల్ల నిఖిల్ నెక్స్ట్ చేస్తున్న 18 పేజెస్ మేకర్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారట.

ఎందుకంటే ఈ సినిమా హిట్ అవ్వడం వల్ల ఇప్పుడు నిఖిల్ నెక్స్ట్ సినిమాలకు హైప్ బాగా పెరిగింది.కార్తికేయ 2 హిట్ వల్ల ఈ సినిమాకు బజ్ బాగా పెరగడంతో బిజినెస్ కూడా బాగా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయట.18 పేజెస్ సినిమాను కుమారి 21F సినిమా ఫేమ్ సూర్య ప్రతాప్ పల్నాటి తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ కథ అందిస్తున్నాడు.

అలాగే గీతా ఆర్ట్స్ 2 పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు.అసలైతే ఈ సినిమా కార్తికేయ కంటే ముందే రిలీజ్ కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.

కానీ ఇప్పుడు మేకర్స్ కార్తికేయ ముందుగా రిలీజ్ అవ్వడమే మంచిది అయ్యింది అని అనుకుంటున్నారు.అలాగే ఈ సినిమాలో కూడా నిఖిల్, అనుపమ నే జంటగా నటించడం కూడా ప్లస్ అయ్యింది.

మరి ఈ సినిమా రిలీజ్ డేట్ త్వరలోనే అనౌన్స్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube