అగ్ర రాజ్యం అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్రం సమస్య లనుంచీ బయటపడేందుకు అధునాతన టెక్నాలజీ ను ఉపయోగిస్తూ, ఎప్పటికప్పుడు అప్డేటెడ్ గా ఉంటుంది.తాజాగా ఆ రాష్ట్రంలో నెలకొన్న శబ్ద కాలుష్య సమస్యను అధిగమించేందుకు గాను ఓ ప్రణాలికను రూపొందించింది.
కాలిఫోర్నియా రాష్ట్రంలో శబ్ద కాలుష్య కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అనారోగ్య సమస్యల బారిన పడుతున్నామని ప్రజలనుంచీ ప్రభుత్వానికి వినతులు వెల్లువెత్తడంతో తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.ఈ క్రమంలోనే.
పెద్ద పెద్దగా శబ్దాలు చేసుకుంటూ దూసుకుపోయే కార్లు, బైకులను ఇట్టే కనిపెట్టేందుకు అధునాతన టెక్నాలజీ ను ప్రవేశపెట్టనుందట.వాహనాలు ఏవైనా సరే భారీ శబ్దాలను చేస్తూ ఎంత వేగంగా వెళ్ళినా వాటి శబ్ద తీవ్రతను కనిపెట్టి ఆ వాహనం నెంబర్ ప్లేట్ ను ఫోటో తీస్తుందట.
రోడ్డుకు ఇరు ప్రక్కల ఈ కెమెరాలను అమర్చనున్నారట.ఈ భారీ ప్రాజెక్ట్ సుమారు 5 ఏళ్ళ పాటు ఉంటుందని ఇందుకు సంభందించిన బిల్లును సైతం కాలిఫోర్నియా రాష్ట్ర సెనేట్ తాజాగా ఆమోదించినట్టుగా తెలుస్తోంది.
ముందుగా కాలిఫోర్నియా రాష్ట్రలో ప్రధాన 5 నగరాలలో ఈ పైలెట్ ప్రారంభించనున్నారు.ఇదిలాఉంటే.
రోడ్డుపై అత్యంత వేగంగా కార్లు ఎన్నో వెళ్తుంటాయి.అయితే అక్కడ ఉండే కార్లలో ఏ కారు పెద్ద శబ్దంతో వెళ్తుందో ఎలా ఆ కెమరాలు గుర్తుపట్టి ఫోటో తీస్తాయి, వెనువెంటనే వాటిని ఎలా ఫోకస్ చేస్తాయి అనే సందేహాలను కాలిఫోర్నియా ప్రజలు సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ కెమెరాలు ఉన్న ప్రాంతంలో వెళ్ళే ప్రతీ ఒక్కరిని ముందుగానే సైన్ బోర్డులు అలెర్ట్ చేస్తాయట.ఇదిలాఉంటే మొదటి తప్పుకు ఎలాంటి అపరాధ రుసుము ఉండదని, కానీ పదేపదే తప్పులు చేస్తే మాత్రం కటినమైన శిక్షలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు అధికారులు మరి కాలిఫోర్నియా లో ఉంటున్న భారత్ ఎన్నారైలు ఈ విషయం గుర్తు పెట్టుకుంటే ఫైన్స్ నుంచీ తప్పించుకోవచ్చు మరి.