తిరుమల తిరుపతి దేవస్థానంకు నూతన పాలకమండలి రానుందా.? ఈ మేరకు సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకోనున్నారా.? అనే విషయంపై చర్చ జోరందుకుంది.
త్వరలోనే టీటీడీకి నూతన పాలక మండలి ఏర్పాటు అవుతుందని తెలుస్తోంది.
సంక్రాంతి తర్వాత కొత్త బోర్డు ఏర్పాటు చేసే అవకాశం ఉందని సమాచారం.ఈ మేరకు కొత్త చైర్మన్ తో పాటు పాలకమండలి సభ్యుల ఎంపికకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
కొత్త పాలకమండలిలో ఛైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డిని నియమించే అవకాశం ఉంది.రెండు రోజుల క్రితం తాడేపల్లిలో సీఎం జగన్ ను భూమన కలిసిన విషయం తెలిసిందే.