స్కాట్‌లాండ్ యార్డ్ పోలీస్ విభాగంలో కౌంటర్ టెర్రరిజం పోలీసింగ్ హెడ్‌గా విధులు నిర్వర్తిస్తున్న నీల్ బసు తన ప్రమోషన్ ప్రక్రియ పట్ల తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు.దీనిపై యూకే హోమ్ ఆఫీస్ నుంచి వివరణ కోరాలని ఆయన భావిస్తున్నట్లు బ్రిటీష్ మీడియా కథనాలు ప్రసారం చేస్తోంది.
మెట్రోపాలిటన్ పోలీస్ అసిస్టెంట్ కమీషనర్, శ్వేతజాతీయేతర వర్గాల్లో సీనియర్ అధికారి అయిన నీల్ బసు.నేషనల్ క్రైమ్ ఏజెన్సీ (ఎన్‌సీఏ) చీఫ్ రేసులో వున్నారు.దీనిని అమెరికన్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ)తో పోలుస్తారు.
ది సండే టైమ్స్ కథనం ప్రకారం.
ఈ పదవికి స్కాట్‌లాండ్ యార్డ్ మాజీ చీఫ్ లార్డ్ బెర్నార్డ్ హుగన్ హౌ, నీల్ బసు తుది వరకు పోటీలో నిలిచారు.కానీ డౌనింగ్ స్ట్రీట్ మాత్రం బెర్నార్డ్ వైపే మొగ్గుచూపింది.
దీనిపై తీవ్ర అసంతృప్తికి గురైన నీల్ బసు.ఈ నియామక ప్రక్రియ పట్ల నిరాశకు గురయ్యానని, మళ్లీ దరఖాస్తు చేయనని స్పష్టం చేశారు.దీనిపై యూకే హోం ఆఫీస్ నుంచి వివరణ కోరతానని నీల్ బసు స్పష్టం చేశారు.ఇదే సమయంలో బసు న్యాయవాదులను సంప్రదిస్తున్నారని, అధికారికంగా ఫిర్యాదు చేయాలని అనుకుంటున్నట్లుగా సండే టైమ్స్ తన కథనంలో పేర్కొంది.
ఏడాదికి 2,23,000 పౌండ్ల వేతనం లభించే ఉద్యోగం తృటిలో తప్పిపోవడంపై బసు ఆగ్రహంగా వున్నారని తెలిపింది.
మరోవైపు.గత వారం ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ లైవ్స్ మేటర్ ఉద్యమాన్ని ప్రేరేపించిన అమెరికాకు చెందిన జార్జ్ ఫ్లాయిడ్ హత్య జరిగి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా బసు ఒక వ్యాసాన్ని రాశారు.ఇందులో బ్రిటీష్ పోలీసింగ్‌లో సంస్థాగతంగా జాత్యహంకారం వుందని వ్యాఖ్యానించారు.
నలుపు , ఆసియా అధికారుల సంఖ్యను పెంచడంలో వివక్ష చూపుతున్నారని బసు సదరు వ్యాసంలో అభిప్రాయపడ్డారు.
ఎన్‌సీఏ చీఫ్ పదవికి సంబంధించి అతని అభ్యర్ధిత్వం ఖరారై వుంటే.యూకేలో ఒక లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీకి నాయకత్వం వహించిన తొలి భారత సంతతి వ్యక్తిగా రికార్డుల్లోకెక్కేవాడు.రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో జాప్యం కారణంగా బసు.మెట్ కమీషనర్ ఉద్యోగానికి, అలాగే ఇంగ్లాండ్ అండ్ వేల్స్‌లోని కాలేజ్ ఆఫ్ పోలీసింగ్‌లో సీనియర్ పదవికి దరఖాస్తు చేసే గడువును కోల్పోయారు.
యూకేలో ప్రధాన దర్యాప్తు ఏజెన్సీ అయిన ఎన్‌సీఏలో డామ్ లిన్ ఓవెన్స్ వైద్య పరమైన కారణాలతో డైరెక్టర్ జనరల్ పదవి నుంచి తప్పుకోవడంతో .గతేడాది నుంచి ఈ పోస్ట్ ఖాళీగా వుంది.అయితే ఈ నియామకంపై వివాదం రేగుతున్న నేపథ్యంలో డౌనింగ్ స్ట్రీట్ వర్గాలు స్పందించాయి.
ఈ వ్యవహారంలో ప్రధాని బోరిస్ జాన్సన్ పాత్ర లేదని ది సండే టైమ్స్‌కి తెలియజేశాయి.