ఈ మధ్య కాలంలో సినిమాల విషయంలో చాలా మందికి మనోభావాలు దెబ్బతింటున్నాయి.ఏదైనా డిఫరెంట్ కంటెంట్ తో సినిమా వచ్చింది అంటే ఈ సినిమాలో మా మనోభావాలు కించపరిచే విధంగా పాలనా సన్నివేశం ఉందని కొంత మంది పనిగట్టుకొని వివాదం చేస్తున్నారు.
ఇలాంటి వివాదాలు అన్ని బాషలలో సినిమాలకి ఎదురవుతున్నాయి.తెలుగులో వాల్మీకి టైటిల్ విషయంలో, అలాగే అర్జున్ రెడ్డి సినిమాలో ఘాటు ముద్దు సన్నివేశాల విషయంలో మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ ఒక వర్గం ప్రజలు రోడ్డుకెక్కారు.
ప్రతి వర్గంలో కొంత మంది ఒక సంఘంగా ఏర్పడి పనిగట్టుకొని ఇలా సినిమాలని టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకున్నారేమో అని అనిపిస్తుంది.ఒకప్పుడు సినిమాని కేవలం సినిమాగా చూసేవారు.
అందులో ఉండే మంచిని మాత్రమే గ్రహించే వారు.అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
ఇదిలా ఉంటే నయనతార అమ్మవారి పాత్రలో నటించిన తమిళ చిత్రం మకుత్తి అమ్మన్.ఈ సినిమా తెలుగులో అమ్మోరు తల్లి టైటిల్ తో రిలీజ్ కాబోతుంది.ఈ నెల 14న ఈ సినిమాని డిస్నీ హాట్ స్టార్ ద్వారా రిలీజ్ చేయబోతున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమా కూడా ఇప్పుడు మనోభావాలు దెబ్బతీసిందని కొందరు రోడ్డుకెక్కారు.
నయనతార పోషించిన అమ్మవారి పాత్ర, ఆ పాత్ర ద్వారా హిందూ భక్తులని తిట్టించడం హిందువుల మనోభావాలు కించపరిచడమే అని కొంత మంది హిందూ సంఘాలు ఆందోళన చేస్తున్నారు.ఆ సన్నివేశాలు వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
లేదంటే హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్న సినిమాపై తమ ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.మరి ఈ సినిమా దర్శకుడు ఆర్జే బాలాజీ ఈ రియాక్షన్ పై ఎలా రియాక్ట్ అవుతాడు అనేది చూడాలి.