నేషనల్ క్రష్ రష్మికకు భాషతో సంబంధం లేకుండా అన్ని భాషలలో అభిమానులు ఉన్నారు.సౌత్ ఇండియాలోని అత్యంత ప్రభావవంతమైన నటీమణులలో రష్మిక కూడా ఒకరు.
లవ్, డేటింగ్, బాయ్స్ గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన రష్మిక ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.తాను కూర్గ్ అనే ప్రాంతంలో పెరిగానని ఆ ప్రాంతంలో ఉండే ఇళ్లు దూరంగా విసిరేసినట్టుగా ఉంటాయని రష్మిక అన్నారు.

కూర్గ్ లో నివశించే సమయంలో తనకు అక్కడ బాయ్స్ కనిపించే వాళ్లు కాదని రష్మిక చెప్పుకొచ్చారు.తన తల్లిదండ్రులను ఆ ప్రాంతంలో ఉండే అబ్బాయిలు ఎక్కడికి తప్పిపోయారని ప్రశ్నించేదానినని రష్మిక వెల్లడించారు.తన డేటింగ్ లైఫ్ ఏ విధంగా సాగిందంటే ఒక అబ్బాయిని చూసిన వెంటనే ఆ అబ్బాయితో డేటింగ్ మొదలైందని భావించేదానినని రష్మిక కామెంట్లు చేశారు.తన ఫ్రెండ్స్ కూడా తాను చూసిన బాయ్ పేరు చెప్పి తనను సరదాగా ఆట పట్టించేవారని రష్మిక అన్నారు.

అయితే తాను మాత్రం ఎవరైతే తనను జాగ్రత్తగా చూసుకుంటారో అలాంటి వ్యక్తులను మాత్రమే ఇష్టపడతానని రష్మిక చెప్పుకొచ్చారు.ఈ విషయాలు వినడానికి చాలా చిన్నవిగా అనిపిస్తాయని అయితే వయస్సు అనేది చాలా చిన్న విషయమని వయస్సు గురించి తాను ఎక్కువగా పట్టించుకోనని రష్మిక పేర్కొన్నారు.ఎవరైతే ఫిట్ గా ఉంటూ వర్కౌట్లు చేస్తారో వాళ్లను తాను ఇష్టపడతానని రష్మిక వెల్లడించారు.
అలాంటి ఫోటోలను మాత్రమే సోషల్ మీడియాలో ప్రొఫైల్ పిక్స్ గా పెట్టుకుంటే బాగుంటుందని రష్మిక అభిప్రాయం వ్యక్తం చేశారు.
బాలీవుడ్ లో మిషన్ మజ్ను మూవీతో ఎంట్రీ ఇస్తున్న రష్మిక తెలుగులో పుష్ప, ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలలో నటిస్తున్నారు.రష్మిక ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు సక్సెస్ సాధిస్తే ఆమె రెమ్యునరేషన్ మరింత పెరిగే అవకాశం ఉంది.