హెచ్‌-1 బీ పై...'నాస్కామ్‌'ఆందోళన

హెచ్ -1 బీ వీసాపై ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఎంతో మంది భారతీయ ఐటీ నిపుణులు ఆందోళన చెందుతుంటే.మరో వైపు ఐటీ కంపెనీలకి ప్రాతినిధ్యం వహించే నాస్కామ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది.

 Nascam Fights Against American Government About H B Visa-TeluguStop.com

హెచ్ -1 క్రింద ఉద్యోగులను నియమించుకునే కంపెనీలు ఈ నెల 3 నుంచి వచ్చే ఏడాది జనవరి 2లోపు తప్పకుండా ఎలక్ట్రానిక్ పద్దతిలో ముందుగానే రిజిస్టర్‌ చేసుకోవాలని అమెరికా ప్రభుత్వానికి చెందిన హోమ్‌లాండ్‌ సెక్యూరిటీ శాఖ కోరింది.

అయితే ఇలా చేయడం వలన రానున్న ఏడాది ఏప్రిల్‌లో లాటరీ పద్దతిలో నిపుణులైన 65,000 మంది విదేశీయులకు హెచ్‌-1బీ వీసాలని జరీ చేయడం జరుగుతుంది…కాని ఇప్పుడు ఈ వీసాల కోసం ముందుగానే సిద్ధమవుతున్న కంపెనీలను ఈ తాజా నిభందన ఆలోచనలో పడేసిందని నాస్కామ్‌ తెలిపింది.అయితే ట్రంప్‌ ప్రభుత్వం విడుదల చేసిన ఈ కొత్త నిబంధనలను పూర్తిగా పరిశీలించిన తరువాత తమ నిర్ణయం ప్రకటిస్తామని తెలిపింది.

అంతేకాదు అమెరికా ప్రభుత్వాన్ని సైతం నాస్కామ్‌ హెచ్చరించింది.ఎందుకంటే ఈ వీసాల నిభంధనలని ప్రతీ సారి చేయడం వలన తీవ్రగా నష్టపోయేది అమెరికానని ఈ విషయంలో ప్రభుత్వం తన వైఖరిని మరో సారి చూసుకోవడం మంచిదని తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube