సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే.ఇక ఇలాంటి సమయంలో ఇండస్ట్రీకి కొత్తగా వస్తున్న హీరోలు కూడా వాళ్ళకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ ముందుకు వెళ్లాలని చూస్తున్నారు.
ఇక ఈ క్రమంలోనే మాడ్( Mad Movie ) అనే సినిమా ద్వారా జూనియర్ ఎన్టీయార్ భార్య అయిన లక్ష్మీ ప్రణతి బ్రదర్ అయిన నార్నే నితిన్( Narne NIthin ) హీరోగా ఎంట్రీ ఇవ్వడం జరిగింది.ఇక ఈ సినిమా ప్రస్తుతం మంచి టాక్ తో ముందుకు దూసుకెళ్తుంది.
ఇక ఇలాంటి క్రమంలో ఈ సినిమా సక్సెస్ అయిన నేపథ్యంలో ఈయన నెక్స్ట్ సినిమా ఎవరితో ఉంటుందనే అంచనాలు ఇప్పటినుంచే స్టార్ట్ అయ్యాయి.అయితే ఈయన నెక్స్ట్ సినిమా శేఖర్ కమ్ముల( Sekhar Kammula )తో చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇప్పటికే శేఖర్ కమ్ముల ధనుష్ హీరోగా ఒక పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు.ఇక ఈ సినిమా తర్వాత ఒక యూత్ ఫుల్ స్టోరీ తో సినిమా చేయాలనే ఉద్దేశ్యం లో శేఖర్ కమ్ముల గారు ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఆ ఉద్దేశ్యం తోనే నార్నే నితిన్ కి ఒక కథ కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది.అయితే ఈ సినిమా చాలావరకు కొత్తగా ఉంటుందని శేఖర్ కమ్ముల చెప్పాడట.
దాంతో ప్రస్తుతం శేఖర్ కమ్ముల ధనుష్ తో చేసే సినిమా పూర్తి అయిన వెంటనే తను ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉండనున్నట్లు గా తెలుస్తుంది.
అయితే శేఖర్ కమ్ముల ధనుష్ సినిమా నుంచి ఫ్రీ అవ్వడానికి ఇంకా ఆరు నెలలు పడుతుంది.కాబట్టి ఆరు నెలల్లో నార్నే నితిన్ ఆ సినిమాకు సంబంధించిన మేకవర్లో బిజీగా ఉండనున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఎన్టీఆర్ ఇచ్చిన సలహా ఏంటి అంటే ఇండస్ట్రీ లో ఎక్కువ సినిమాలు చేయకపోయిన పర్వాలేదు, కానీ చేసిన సినిమాలు పర్ఫెక్ట్ గా చేస్తే సరిపోతుందని చెప్పడం వల్ల ఆయన మంచి సినిమాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
అందులో భాగంగానే శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో చేసే సినిమా కోసం ఇప్పటి నుంచే మేకవర్ మీద దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది…