ఏపీలో ఎన్నికల వేడి పెరుగుతోంది.ఎలక్షన్స్ లో గెలుపే లక్ష్యంగా పలు కార్యక్రమాలకు, పాదయాత్రలకు నేతలు సిద్ధం అవుతున్నారు.
ఈ నేపథ్యంలోనే టీడీపీ నేత నారా లోకేశ్ పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు.‘యువగళం’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రను చేపట్టనున్నారు.
వచ్చే నెల 27న ఉదయం 11 గంటలకు కుప్పం నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నారు.ఈ మేరకు టీడీపీ అధికారిక ప్రకటన చేయనున్నారు.
ఈ యాత్ర సుమారు 400 రోజులు నాలుగు వేల కిలో మీటర్ల మేర కొనసాగనుంది.ప్రజా సమస్యలను తెలుసుకుంటూ పాదయాత్రను నిర్వహించనున్నారు.