నక్షత్రం మూవీ రివ్యూ

చిత్రం : నక్షత్రం
బ్యానర్ : బుట్ట బొమ్మ క్రియేషన్స్
దర్శకత్వం : కృష్ణవంశీ
నిర్మాతలు : శ్రీనివాసులు, వేణుగోపాల్, సజ్జు
సంగీతం : భీమ్స్, హరి, భరత్
విడుదల తేది : ఆగష్టు 4, 2017
నటీనటులు : సందీప్ కిషన్, సాయి ధరమ్ తేజ్, రెజినా, ప్రగ్యా, ప్రకాష్ రాజ్

 Nakshatram Movie Review-TeluguStop.com

ఒకనాటి క్రియేటివ్ దర్శకుడు కృష్ణ వంశీ హిట్ కొట్టి చాలాకాలమైంది.కంబ్యాక్ ఆశలతో మొదలుపెట్టిన నక్షత్రం సినిమా తీయడానికి కూడా చాలాకాలమైంది.ఇద్దరేసి హీరోలు, ఇద్దరేసి హీరోయిన్లతో తీసిన నక్షత్రం కృష్ణ వంశీ కెరీర్ లో నక్షత్రంలా మిగిలిపోతుందో లేదో చూడండి.

కథలోకి వెళితే :


రామ రావు (సందీప్ కిషన్) కి పోలీసు అంటే పిచ్చి.పోలీసు అవడం కోసం ఎంతైనా కష్టపడతాడు.అతని కుటుంబంలో తండ్రి మరియు తాత కూడా పోలీసు అవడం వలన తను కూడా ఆ లేగేసిని నిలబెట్టేలా పోలీసు అవ్వాలి అనుకుంటాడు.

ఇతని ప్రేయసి జమున రాణి (రెజినా).

రామ రావు పోలీసు ప్రయత్నాల్లో ఉండగా అతడి జీవితంలో కి వస్తాడు తనీష్.రామ రావుకి అతను అడ్డంకిగా ఎందుకు మారాడు ? కథలో అలేగ్జందర్ ఎవరు ? రామారావు తను అనుకున్నన లక్ష్యాన్ని సాధించాడో లేదో సినిమా చూసి తెలుసుకోండి.

నటీనటుల నటన :


కృష్ణ వంశీ సినిమాలు అంటే పాత్రలు ఎలా ఉంటాయో, ఆ పాత్రధారులు తెర మీద ఎలా మాట్లాడుతారో మనకు బాగా తెలుసు.ఏ నటుడు అయినా సరే, తన సహజశైలిని వదిలిపెట్టి కృష్ణ వంశీ శైలిలోకి రావాల్సిందే.సందీప్ కిషన్ కి ఇలాంటి పాత్ర చాలా కొత్త.కొన్నిచోట్ల బాగా పలికిన భావోద్వేగాలు, కొన్ని చోట్ల ఒవర్యాక్షన్ లా అనిపిస్తాయి.సందీప్ ఒక్కడనే కాదు, అందరి పరిస్థితి అంతే.

రెజినా, ప్రగ్య గ్లామర్ డోసు ఎక్కువైంది.అందరిలోకి సాయిధరమ్ తేజ్ పాత్ర బెటర్.

ప్రకాష్ పర్వాలేదు.తనీష్ విలనిజం అస్సలు బాగా లేదు.

శివాజీరాజ పాత్ర టూ మచ్ లౌడ్.అందరు మంచి నటులే ఉన్నా, నటనకి ఓ లిమిట్ పెట్టుకోకుండా నటించారు.

టెక్నికల్ టీం :/


సినిమాటోగ్రాఫీ ఎదో ఒకే.సీన్లు ఎలా ఉన్నా ఓ రెండు పాటల చిత్రీకరణ బాగుంది.ముగ్గురు నలుగురు సంగీత దర్శకులని తీసుకొచ్చినా లాభం లేకుండా పోయింది.ఆడియోలో ఎలాగో ఒక్క పాట కూడా ఆకట్టుకోలేదు.తెరపై ఎదో హీరోయిన్ల అందాల కోసం చూడటమే.ఎడిటింగ్ చాలా పూర్.

పట్టుమని పది నిమిషాలు కూడా సినిమా మంచి ఫ్లో లో వెళుతున్నట్లుగా అనిపించదు.ఇలాంటి బోరింగ్ కథనానికి అంత నిడివి ఎందుకో.

విశేషణ :


కేవలం ఓ కథావస్తువుని ఎంచుకోవడమే కాదు, దాన్ని ప్లాట్ కి సూటేబుల్ గా, అలాగే ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా చెప్పగలగాలి.కాని కొందరు దర్శకులు ప్రేక్షకుల అభిరుచి కన్నా తమ మార్క్ లేదా స్టయిల్ కే ఎక్కువ విలువ ఇస్తారు.

బకరా కామెడితో శ్రీనువైట్ల, ఆరోగేంట్ హీరోయిజంతో పూరి జగన్నాథ్, లౌడ్ క్యారక్టర్స్ తో కృష్ణవంశీ .అందరు హిట్స్ లేక తల్లడిల్లుతున్నారు.నక్షత్రం మరో కృష్ణ వంశీ మార్క్ సినిమా.కథని కథలా కాకుండా తన విపరీతమైన స్టయిల్ లో చెప్పడానికి ప్రయత్నించిన సినిమా.ఎవరు మాట్లాడరు, అందరు అరుస్తారు.ఓవర్ ది టాప్ .ఓవర్ ది టాప్.ఎక్కడా కూడా మనం కనెక్ట్ అవలెం.

కథాంశాన్ని తప్పుబట్టలేం.తప్పుపట్టాల్సింది కేవలం కృష్ణవంశినే.

ఆయన తీసిన మురారి, నిన్నె పెళ్ళాడతా లాంటి సినిమాలను దృష్టిలో పెట్టుకొని, పెద్దగా విమర్శించలేం.కేవలం బాధపడగలం.అసలే ఓపెనింగ్స్ లేని నక్షత్రం, చాలా త్వరగా క్లోజ్ అయిపోతే అస్సలు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

ప్లస్ పాయింట్స్ :


* రెజినా, ప్రగ్య గ్లామర్

మైనస్ పాయింట్స్ :

* సినిమా మొత్తం

చివరగా :


పట్టపగలే నక్షత్రాలు

రేటింగ్ : 1.5/5

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube