టాలీవుడ్ సీనియర్ హీరో శివాజీ( Senior Hero Shivaji ) బిగ్‌బాస్ తెలుగు సీజన్-7లో సర్‌ప్రైజ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.ఆ సమయం నుంచి ఈ నటుడు హౌస్ లో ఏకచక్రాధిపత్యం వహిస్తున్నాడు.
అందరిపై పెత్తనాలు చెలాయిస్తూ బిగ్ బాస్ పై కూడా నోరు పారేసుకుంటున్నాడు.ఇతర కంటెస్టెంట్స్ మీదకు వెళుతూ వారితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు.
అయినా నాగార్జున అతడినే నెత్తిన పెట్టుకుంటున్నాడు.ఇతర కంటెస్టెంట్స్ ని తిట్టినా సరే శివాజీని నాగార్జున వెనకేసుకొస్తున్నాడు.
బిగ్ బాస్ హౌస్( Bigg Boss House ) లో శివాజీకి ఏ రూల్స్ వర్తించవన్నట్లు యాజమాన్యం కూడా అతడిని ఫ్రీగా వదిలేసింది.అతనికే ఈ సీజన్ టైటిల్ ఇచ్చినా ఆశ్చర్యపోయినక్కర్లేదనే ఒక అభిప్రాయం కూడా చాలామందిలో వ్యక్తమవుతోంది.
శివాజీ ప్రవర్తన చాలా చెడుగా ఉన్నా సరే అతడిని చాలా స్పెషల్ గా, ప్రేమగా చూడటం అందరినీ విస్తుగొలుపుతోంది.శివాజీ హౌస్ లో గ్రూపు మెయింటైన్ చేస్తూ ఇతర గ్రూపు పై ద్వేషాన్ని వెళ్లగక్కుతూ చాలా వరస్ట్ కంటెస్టెంట్ గా కనిపిస్తున్నాడు.ఎవర్నో ఒకరిని బాగా కొట్టేసి హౌస్ నుంచి వెళ్ళిపోతానని శివాజీ గతంలో ఒక కామెంట్ చేసిన సంగతి తెలిసిందే.అయితే దాని గురించి నాగార్జున క్వశ్చన్ వేశాడు.
శివాజీ దానికి కూడా దురుసు గానే ఆన్సర్ ఇచ్చాడు.అయినా నాగార్జున( Nagarjuna )కు కొంచెం కూడా కోపం రాలేదు.
కంటెస్టెంట్ ఆట సందీప్ బొంగులో అనే పదం వాడే సరికి అతడి మీద మాత్రం విరుచుకుపడ్డాడు.
ఇక రతికా( Rathika Rose ) వంటి కంటెస్టెంట్స్ శివాజీ కాళ్లు పట్టుకుంటూ అతడిని చెట్టు ఎక్కిస్తున్నారు.దాంతో ఈ నటుడు మరింత రెచ్చిపోతున్నాడు.తానేం చేసినా చెల్లుతుంది అనే ఉద్దేశంతో అతడు ఆట ఆడుతున్నాడు.
బిగ్‌బాస్ టీమ్ ఎవరు ఏ తప్పు చేసినా వెంటనే టార్గెట్ చేస్తుంది కానీ శివాజీ విషయంలో మాత్రం వేరే వైఖరిని అవలంబిస్తుంది.ఒకవేళ అతడు ఆట మంచిగా ఆడుతూ, మంచి కంటెంట్ అందిస్తున్నాడా అంటే అదీ లేదు.
బెస్ట్ కంటెస్టెంట్( Best Contestant ) పట్ల కొంచెం బైయాస్డ్ వైఖరిని చూపిస్తే పర్లేదు కానీ శివాజీ వల్ల షోకి ఒరిగేది ఏమీ లేదు.అయినను శివాజీని స్టార్ మా( Star Maa ) యాజమాన్యం నెత్తిన పెట్టుకోవడం నిజంగా ఆశ్చర్య పోవాల్సిన విషయమే.
ఇక బిగ్ బాస్ మిగతా విషయాల్లో కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నాడు.రతికాని కాకుండా సింగర్ దామినిని తీసుకొచ్చినట్లయితే బాగుండు అని ఆడియన్స్ చాలా నిరాశ పడిపోతున్నారు.
ఎందుకంటే రతిక ఆట ఆడటం మానేసి అందరి కాళ్లు వేళ్లు పట్టుకుంటూ కాలం గడుపుతోంది.ఆమె వెళ్లే షో కొంచెం కూడా ఎంటర్‌టైనింగ్‌గా మారలేదు.