ఎన్నికలు దగ్గరలోకి వచ్చినందున తెలంగాణ రాజకీయ ( Telangana politics )ముఖచిత్రం క్రమంగా మారుతుంది.తమ రాజకీయ భవిష్యత్తుపై భరోసా కోసం నేతలు పార్టీలు మారుతున్నారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో బారాస ఎమ్మెల్యే అయిన కూచ కుళ్ల దామోదర్ రెడ్డి ( Kucha Kulla Damodar Reddy )కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.గత కొన్ని నెలలుగా ఈయన కాంగ్రెస్ ఎంట్రీ పై సస్పెన్స్ కొనసాగుతుండగా ఈరోజు ఆయన సస్పెన్స్ కి తెరదించేశారు .ఇక్కడ జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యక్షంగా హాజరైన ఆయన తనపై వస్తున్న ఊహగనాలను నిజం చేశారు.గతంలోనూ కాంగ్రెస్ నాయకుడుగా కొనసాగిన దామోదర్ రెడ్డి అప్పటి తెలుగుదేశం కీలక నే త నాగం జనార్దన్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వడంతో పార్టీపై అలిగి భారతీయ రాష్ట్ర సమితిలో చేరారు.
అదికార పార్టీ ఆయనకు ఎమ్మెల్సీ గా అవకాశం ఇచ్చింది .నాగర్ కర్నూల్ ( Nagar Kurnool )నుంచి నాగర్ జనార్దన్ రెడ్డి( Nagar Janardhan Reddy ) పై గెలిచిన బారాసా అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డితో కూడా దామోదర్ రెడ్డికి సఖ్యత లేదని వార్తలు వస్తూ ఉంటాయి.సీనియర్ రాజకీయ నాయకుడైన దామోదర్ రెడ్డి ఇప్పుడు తన కుమారుని రాజకీయ భవిష్యత్తు కోసం అనేక రాజకీయ పార్టీలతో సమాలోచనలు చేస్తున్నారు.అధికార బారాస పార్టీలో వచ్చే ఎన్నికలలో నాగర్కర్నూల్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా టికెట్ ఆశించినా ఆయనకు ఆ మేరకు స్పష్టమైన హామీ దక్కకపోవడంతో గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ కీలక నేతలతో టచ్ లో ఉంటున్నారు .మొత్తానికి కాంగ్రెస్ నుంచి నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే టికెట్ పై హామీ పొందినందునే ఆయన తన కుమారుడు రాజేష్ తో కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని ఉన్నట్లుగా తెలుస్తుంది .మరి సీనియర్ నాయకుడైన నాగం జనార్దన్ రెడ్డికి కాంగ్రెస్ ఏ విధంగా న్యాయం చేస్తుంది అన్నదే ప్రశ్నగా మారింది.
ఇద్దరిలో ఒకరికి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి మరొకరికి ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తామన్న హామీలతోనే ఇద్దరు నేతలను కాంగ్రెస్ బుజ్జగించనున్నట్లుగా తెలుస్తోంది .ఒకప్పుడు అధికారానికి చాలా దూరంగా కనిపించిన కాంగ్రెస్( Congress ) నేడు రోజురోజుకీ బలపడుతూ కీలకమైన నేతలను పార్టీ వైపుగా ఆకర్షించగలుగుతుంది.గట్టిగా ప్రయత్నిస్తే అధికారంలోకి రావచ్చన్న ధీమా ఇప్పుడు కాంగ్రెస్ నాయకులలో కనిపిస్తుంది.ఇదే ఊపు రానున్న రోజుల్లో కూడా కొనసాగితే తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి పీఠానికి దూసుకెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది
.