ఆస్ట్రేలియా( Australia )లోని మెల్‌బోర్న్‌కు చెందిన కుముతిని కన్నన్ అనే మహిళ ఒక నేరాన్ని కప్పిపుచ్చడానికి మరో నేరం చేసింది.ఆమె విచారణలో సాక్ష్యం చెప్పాల్సిన ఓ తమిళ ఎన్నారై మహిళను బెదిరించింది.
దాంతో ఆమెకు అదనంగా రెండున్నరేళ్ల జైలు శిక్ష పడింది.వివరాల్లోకి వెళితే.
మెల్‌బోర్న్‌లో నివాసముంటున్న కుముతిని, ఆమె భర్త కలిసి ఎనిమిదేళ్లుగా ఒక మహిళను తమ ఇంట్లో బానిసగా ఉంచుకున్నారు.ఈ కేసులో వారు ఇప్పటికే దోషులుగా తేలింది.
అంతే కాదు వారికి 2021లో శిక్ష పడింది.
తరువాత ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీసుల విచారణలో న్యాయ మార్గాన్ని పక్కదారి పట్టించేందుకు కుముతిని ప్రయత్నించిందని తేలింది.
ఆ అభియోగాన్ని కూడా ఆమె అంగీకరించింది.బానిసత్వ నేరానికి సంబంధించి ఆమె ప్రస్తుత జైలు శిక్షను పూర్తి చేయడానికి 18 నెలల ముందు కొత్త శిక్ష ప్రారంభమవుతుందని న్యాయమూర్తి నిర్ణయించారు.
ఆమె జనవరి 2026లో పెరోల్‌కు అర్హత పొందుతుంది.
<img src="“/>
కుముతిని భర్త కూడా దోషిగా నిర్ధారించబడింది.
అతనికి మూడేళ్ల నాన్-పెరోల్ వ్యవధితో ఆరు సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది.బానిసత్వ నేరాలకు సంబంధించి 2016లో వారిపై ఫెడరల్ పోలీసులు అభియోగాలు మోపారు.విచారణ సమయంలో, కుముతిని బాధితురాలిని బెదిరించి, సాక్ష్యం చెప్పకుండా ఆపడానికి ప్రయత్నించింది.
అయితే ఆస్ట్రేలియన్ కోర్టు( Australian Court ) బానిసత్వం అనేది అత్యంత అమానవీయమైన చర్య అని అభివర్ణించింది.కుముతిని ఇంట్లో 8 ఏళ్లుగా బానిసగా ఉన్న ఆ తమిళ మహిళ అనారోగ్యం పాలయ్యి చివరికి ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది.అదే సమయంలో ఆమె దయనీయ పరిస్థితి బయటపడింది.