సుధీర్ బాబు హీరోగా నాని విలన్‌గా మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వి’.ఈ చిత్రం ఫస్ట్‌లుక్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
నాని ఈ చిత్రంలో విలన్‌గా నటించడం వల్ల సినిమాపై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి.అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్వకుడు విభిన్నమైన స్క్రీన్‌ప్లేతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లుగా యూనిట్ సభ్యులు అంటున్నారు.
అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఈ చిత్రం ఉంటుందని సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ చిత్రం టీజర్‌ను ఈనెల 17న విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.
ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చివరి దశ చిత్రీకరణ జరుపుతున్నారట.అదే సమయంలో సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.
టీజర్‌తో సినిమాపై అంచనాలు అమాంతం పెంచేలా చిత్ర యూనిట్ సభ్యులు ప్లాన్ చేస్తున్నారు.అందుకే ఈ చిత్రం టీజర్ విషయంలో యూనిట్ సభ్యులు అంతా కూడా చాలా జాగ్రత్తలు మెయింటెన్ చేస్తున్నారు.
మరి టీజర్ ఎలా ఉంటుందో చూడాలంటే మరో వారం రోజులు ఆగాల్సిందే.