కుబేరుడిగా మార్చిన లాటరీ టికెట్: వారం క్రితం అనుమానాస్పద మృతి

ఇథియోపియా లక్కీమెన్ మైఖేల్ గెబ్రూ అనుమానాస్పద మృతి వెనుక గల కారణాలను నిగ్గు తేల్చాల్సిందిగా అతని కుటుంబసభ్యులు కెనడా ప్రభుత్వాన్ని కోరారు.శనివారం అతని కుటుంబసభ్యులు, స్నేహితులు, ఇథియోపియా జాతీయులు ఒక చర్చలో సమావేశమై గెబ్రూ సేవలను గుర్తు చేసుకున్నారు.

 Multi Millionaire Michael Gebru Whodiedmysteriously In Ethiopia Lottery-TeluguStop.com

సాధారణ ప్లాంట్ ఉద్యోగి నుంచి మిలియనీర్‌గా ఎదిగాడని.ధనవంతుడిగా మారానన్న గర్వం లేకుండా ఎంతోమందికి సాయం చేశాడని అతని సన్నిహితులు కన్నీటిపర్యంతమయ్యారు.

Telugu Ethiopia, Michael Gebru, Telugu Nri Ups-

  ఇథియోపియాకు చెందిన మైఖేల్ తన కుటుంబసభ్యులతో కలిసి కెనడాలోని టోరంటో‌లో స్థిరపడ్డాడు.2017లో అసెంబ్లీ ప్లాంట్ ఉద్యోగం నుంచి తొలగించబడిన అతనికి గతంలో కొన్న లాటరీ టికెట్‌పై 10.7 మిలియన్ డాలర్ల ఫ్రైజ్‌మనీ తగిలింది.దీంతో ఆ రోజు నుంచి గెబ్రూ జీవితమే మారిపోయింది.

ఆ డబ్బుతో కుటుంబసభ్యులకు విలాసవంతమైన జీవితాన్ని అందించడంతో పాటు టోరెంటో, ఇథియోపియా, సోమాలియాలలోని ఎన్నో చర్చిలకు మైఖేల్ విరాళాలు ఇచ్చాడు.

Telugu Ethiopia, Michael Gebru, Telugu Nri Ups-


 

Telugu Ethiopia, Michael Gebru, Telugu Nri Ups-

 

ఈ నేపథ్యంలో అతను గత సోమవారం స్వదేశంలోనే అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించడం కలకలం రేపింది.ఆయన మరణానికి దారితీసిన కారణాలను అన్వేషించాల్సిందిగా మైఖేల్ గెబ్రూ కుటుంబసభ్యులు ఇథియోపియాలోని కెనడా ఎంబసీకి ఫిర్యాదు చేశారు.దీనిపై స్పందించిన కెనడా ఎంబసీ అధికారులు.

తాము స్థానిక పోలీసులతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నామని ఒకవేళ గెబ్రూ మృతి వెనుక కుట్రకోణం వుంటే దోషులను వదిలిపెట్టమన్నారు.గెబ్రూ అంత్యక్రియలు సోమవారం ఆయన స్వదేశం ఇథియోపియాలో కుటుంబసభ్యులు, సన్నిహితుల అశృనయనాల మధ్య జరిగాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube