రైతు సంఘర్షణ సభకు భారీగా కదలిరండి:- రైతులకు కాంగ్రెస్ పార్టీ పిలుపు

అన్నదాతకు న్యాయం చేయడం కోసం, టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు పూర్వ భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో మే 6 న వరంగల్ నిర్వహించనున్న రైతు సంఘర్షణ సభకు రైతులు భారీ సంఖ్యలో కదిలి రావాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ పిలుపునిచ్చారు.జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు ముందుగా మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వర్రావు , స్థానిక సంస్థల అభ్యర్థిగా పోటీ చేసిన అభ్యర్థి రాయల నాగేశ్వర్రావుతో కలిసి రైతు సంఘర్షణ సభ కరపత్రాలను ఆవిష్కరించారు.

 Move Heavily To The Farmers' Conflict House: - Congress Party's Call For-TeluguStop.com

అనంతరం పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ .రాష్ట్రంలో కేసీఆర్ నియంతృత్వ పాలన అవలంభిస్తున్నారని మండిపడ్డారు .ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని అన్నారు .కేసీఆర్ విధానాల వల్ల రాష్ట్ర రైతాంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు .రాష్ట్రంలో వరి వేస్తే ఉరే అన్న కేసీఆర్ ప్రత్యామ్నయ పంటలపై ఎలాంటి దిశా నిర్దేశం చేసిన పాపాన పోలేదని విమర్శించారు .వరి వేయకుండా దాదాపు పది లక్షల ఎకరాలలో రైతులు శనగలు , కందులు , పల్లీలు లాంటి ప్రత్యామ్నయ పంటలు వేశారని వాటికి ప్రోత్సాహం అందించకపోగా ఇంతవరకూ మద్దతు ధర కూడాప్రకటించ లేదని అన్నారు .రాష్ట్రంలో రైతులందరికీ 26 లక్షల క్వింటాళ్ల ఎరువులు ఫ్రీగా ఇస్తానని 2017 లో కేసీఆర్ హామి ఇచ్చారని ఐదేండ్లు గడుస్తున్నా ఇప్పటికి రైతులకు ఫ్రీగా ఎరువులు ఇచ్చిందే లేదని అన్నారు .నకిలీ ఎరువులు , పురుగు మందులు , నకిలీ విత్తనాలతో ఉమ్మడి వరంగల్ , ఖమ్మం , నల్గొండ జిల్లాల పరిధిలో మిర్చీ , పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పంటలకు బీమా లేదు , మరణానికి పరిహారం ఇచ్చింది లేదని అన్నారు .కాంగ్రెస్ హయాంలో ప్రవేశ పెట్టిన పంటల బీమా పథకాన్ని 2018 నుంచి కేసీఆర్ అటకెక్కించారని విమర్శించారు .నేడు రాష్ట్రంలో ప్రకృతి విపత్తులతో పంట నష్టం జరిగితే రైతుకు నయా పైసా పరిహారం వచ్చే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు .టీఆర్ఎస్ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామన్న కేసీఆర్ నాలుగు విడతలుగా చేయడంతో వడ్డీనే తప్పఅసలు మాఫీ కాలేదని అన్నారు .మద్దతు ధర అడిగిన రైతుల చేతులకు బేడీలు వేసిన దుర్మార్గ పాలన కేసీఆర్ అవలంభిస్తున్నారని దూషించారు .రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంగా ఉందని ఇవన్నీ టీఆర్ఎస్ ప్రభుత్వం హత్యలే అని మండిపడ్డారు .ఈ విధంగా రైతులను మోసం చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి రైతులకు అండగా ఉంటామని భరోసా ఇవ్వడానికి రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రైతు సంఘర్షణ సభకు రైతన్నలు భారీగా తరలిరావాలని

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube